Site icon OkTelugu

నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌లో 1500 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నార్నర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న 1500 అప్రెంటిస్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎనిమిది, పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జులై 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. http://nclcil.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మొత్తం 1500 ఉద్యోగ ఖాళీలలో వెల్డర్‌ (గ్యాస్‌, ఎలక్ట్రిక్‌) ఉద్యోగ ఖాళీలు 100 ఉండగా ఫిట్టర్‌ ఉద్యోగ ఖాళీలు 800, ఎలక్ట్రీషియన్‌ 500, మోటార్‌ మెకానిక్‌ 100 ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు ఎనిమిది, పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసిన వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 జూన్‌ 30 నాటికి 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం జులై 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. http://nclcil.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Exit mobile version