ED raids On Lyca Productions: రజినీకాంత్ చిత్ర నిర్మాణ సంస్థపై ఈడీ దాడులు… మైత్రీ మీద సోదాలు మరవక ముందే!
లైకా ప్రొడక్షన్స్ కి సుబాస్కరన్ అధిపతిగా ఉన్నారు. ఆయన కొన్నేళ్లుగా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ 1 అండ్ 2 చిత్రాలను నిర్మించింది లైకానే.

ED raids On Lyca Productions: చిత్ర నిర్మాణ సంస్థలపై అధికారుల దాడులు కలవరం రేపుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పై జరిగిన సోదాలు మరవక ముందే ఈడీ అధికారులు మరొక సంస్థను టార్గెట్ చేశారు. చెన్నైలో మంగళవారం ఉదయం నుండి లైకా ప్రొడక్షన్స్ మీద ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈడీ సంస్థకు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. ఇళ్ళు, ఆఫీసులు వదలకుండా సోదాలు చేస్తున్నారు. కోలీవుడ్ వర్గాల్లో నేటి ఉదయం నుండి ఈ సంఘటన షాక్ కి గురి చేస్తుంది.
లైకా ప్రొడక్షన్స్ కి సుబాస్కరన్ అధిపతిగా ఉన్నారు. ఆయన కొన్నేళ్లుగా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ 1 అండ్ 2 చిత్రాలను నిర్మించింది లైకానే. ప్రస్తుతం భారతీయుడు 2, రజినీకాంత్ హీరోగా లాల్ సలామ్ తో పాటు మరికొన్ని చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. భారతీయుడు 2, లాల్ సలామ్ భారీ బడ్జెట్ చిత్రాలుగా ఉన్నాయి.
సినిమాల పెట్టుబడులు, వసూళ్లు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఈడీ అధికారుల ప్రధాన ఆరోపణ. అదే సమయంలో నిర్మాతలు పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారా? ఆదాయం ఎంత? పన్ను చెల్లించింది ఎంత? అనే కోణంలో విచారణలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ డబ్బు బ్లాక్ నుండి వైట్ కి మార్చుకునేందుకు సినిమాల్లో పెట్టుబడి పెడుతున్నారనే వాదన ఉంది. అందుకే ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
గత నెలలో మైత్రీ మూవీ మేకర్స్ పై ఈడీ దాడులు జరిగాయి. ఐదు రోజుల పాటు నిరవధికంగా సోదాలు నిర్వహించారు. ఇళ్ళు, ఆఫీసులు, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. వరుసగా మైత్రీ మూవీ మేకర్స్ తో సినిమాలు చేస్తున్న దర్శకుడు సుకుమార్ పై కూడా ఈడీ దాడులు జరిగాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూమి కొనుగోలు చేశారనే వాదనలు వినిపించాయి. రోజుల వ్యవధిలో మరో సౌత్ ఇండియా బడా నిర్మాణ సంస్థను పోలీసులు ఫోకస్ చేశారు.
