ED IT Raids On TRS Leaders: ఆషామాషీ కాదు.. అడుగునా ఇన్ఫార్మర్లు: ఐటి దాడులు జరుగుతాయి ఇలా

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 08:48 AM IST

ED IT Raids On TRS Leaders: కెసిఆర్ ఆరోపిస్తున్నట్టు… కవిత ధ్వజమెత్తుతున్నట్టు.. మల్లారెడ్డి పళ్ళు కొరుకుతున్నట్టు.. తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శ చేస్తున్నట్టు.. ఉండదు ఐటి శాఖ పనితీరు.. భారత రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర వ్యవస్థల్లో ఐటి ఒకటి. రాజకీయ కారణాల వల్ల మనదేశంలో ఇన్నాళ్లు అది కోరల్లేని పాములాగా బతికింది.. కానీ ఇప్పుడు విశేష అధికారాలను లభించడంతో “నీ దూకుడు సాటి ఎవ్వరు” అనే పాట తీరున దూసుకుపోతోంది. ముఖ్యంగా ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకున్న వారి భరతం పడుతోంది.. చాలామంది అనుకున్నట్టు ఐటి శాఖ పనితీరు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఉండదు.. ఐటి శాఖ ఒకసారి దాడులు దిగుతోంది అంటే దాని వెనుక భారీ స్కెచ్ ఉంది అని అర్థం.. తెలంగాణలో ప్రస్తుతం ఐటి శాఖ విస్తృతంగా దాడులు చేస్తోంది.. ఈ క్రమంలో ఐటి శాఖ దాడుల వెనుక కథ ఎలా ఉంటుందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ED IT Raids On TRS Leaders

ఈజీ కాదు

ఐటీ శాఖ దాడులు చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. లక్షిత వ్యక్తులు, వారి బంధువులు, కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు జరుపుతూ ఉంటారు.. ఇంతమంది ఇళ్లల్లో ఒకేసారి, ఒకే సమయంలో సోదాలు ఎలా సాధ్యం? “వి ఆర్ ఫ్రొం ఐటి డిపార్ట్మెంట్.. ఇంటి తలుపులు తట్టి.. చక చకా ఇంట్లోకి వెళ్లి అందరి దగ్గర సెల్ ఫోన్ లు తీసుకోవడంతో పాటు, ల్యాండ్ లైన్ ఫోన్ డిస్కనెక్ట్ చేస్తారు. ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతుండగానే గేటు వద్ద భద్రతా సిబ్బంది లోపల వారు బయటకి, బయట వారు లోపలికి రాకుండా పహారా కాస్తారు. కానీ ఇదంతా చూసే వారికి.. ఎలా సాధ్యం అనిపిస్తుంది. ఉదాహరణకు మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, అందులో పని చేసే ఉద్యోగుల ఇళ్ళు.. ఇలా ఏకకాలంలో ఐటీ బృందాలు సోదాలు జరిపాయి. ఎవరిపై నైనా ఇలాగే దాడులు జరుగుతాయి.. తెల్లవారక ముందే ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ ఎలా నొక్కుతున్నారు? ఇంతమంది అడ్రస్సులు ఎలా తెలుసు? అంటే దీనికి సమాధానం లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నట్టు… ఈ వ్యవహారాలు మొత్తం రెండో కంటికి తెలియకుండా ఐటీ శాఖ పూర్తి చేస్తుంది. అక్కడిదాకా ఎందుకు ” మా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది చిరునామా మాకే తెలియదు. కానీ వారి చిరునామా ఐటీ వారికి ఎవరు చెప్పారో” అని మంత్రి మల్లారెడ్డి అన్నారంటే దాడులు ఎంత పకడ్బందీగా జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు.

సమాచారమే ముఖ్యం

పన్ను ఎగవేతదారులు, లెక్కలేని నగదు కలిగి ఉన్న వారి సమాచారం ఐటీ శాఖకు రెండు రకాలుగా అందుతుంది.. ఒకటి ఎవరైనా ఫిర్యాదు చేయడం, రెండు ఐటి విభాగం తన ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టడం.. ఐటీ విభాగం తన నిఘా వ్యవస్థను చాలా గోప్యంగా ఉంచుతుంది. వారు ఎవరి సమాచారం సేకరిస్తున్నారు అన్నది ఎవరికీ తెలియదు. ఆరోపణలు వచ్చిన వ్యక్తి, అతని స్నేహితులకు సంబంధించి భౌతిక ఆధారాలతో పాటు భారతీయ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం అవసరమైన వివరాలు సేకరిస్తారు.. ఎవరెవరు వద్ద నగదు లేదా ఆధారాలు ఉండే అవకాశం ఉంటుందో వారి ఇళ్ళు, కార్యాలయాలు, గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్ ల వివరాలు తెలుసుకోవడం, ఏఏ సమయంలో ఎక్కడెక్కడికి వచ్చి వెళుతుంటారు, ఇలా ప్రతి అంశానికి సంబంధించి పక్కాగా సమాచారం సేకరిస్తారు. ఇందుకోసం ఐటి బృందాలు సోదాలు నిర్వహించాల్సిన వ్యక్తి స్థాయిని బట్టి కొన్ని రోజులు, నెలలు అత్యంత గొప్పంగా సమాచారం సేకరిస్తాయి.. ఐటీ సోదాలు నిర్వహించాల్సిన వ్యక్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత అధికారులు దాన్ని ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి అందజేస్తారు.. ఐటీ విభాగం ప్రిన్సిపల్ డైరెక్టర్ అనుమతి మేరకు వారెంట్ తీసుకుంటారు.

గోప్యత

సోదాలకు అనుమతులు ఇచ్చిన తర్వాత స్థానికంగా ఉండే ఐటిఐ అధికారులు ఎన్ని ప్రాంతాల్లో సోదాలు జరపాల్సి ఉంటుందనే సమాచారం మేరకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకుంటారు. ఒకటి రెండు ప్రాంతాలకు సోదరులు జరిపేందుకు 30 మంది సిబ్బంది సరిపోతారు అనుకుంటే గంగా ఉండేవారిని వినియోగించుకుంటారు. వేరువేరు ప్రాంతాల్లో సోదాలు జరపాల్సి రావటం, వందల సంఖ్యలో సిబ్బంది అవసరం ఏర్పడితే ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తారు. సోదాలకు ఒక రోజు ముందుగానే స్థానిక హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు హోటళ్ళలో బస చేస్తారు. అక్కడ తాము ఐటీ విభాగానికి చెందిన వారమనే విషయం బహిర్గతం కాకుండా జాగ్రత్త పడతారు. సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఉంటారు. సోదాలు జరిగే రోజు అవసరాన్ని బట్టి అర్ధరాత్రి తర్వాత, తెల్లవారుజామున వారు కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.

malla reddy

ఒక్కో బృందాన్ని నడిపే బాధ్యత ఒక్కో అధికారికి కేటాయిస్తారు. వారికి సీల్డ్ కవర్లో టార్గెట్ కు సంబంధించిన వివరాలు అందజేస్తారు. సోదాలు జరిపే వ్యక్తి నివాసం, కార్యాలయం సమీపంలోని ల్యాండ్ మార్క్ చెప్పి పంపుతారు. అక్కడికి వెళ్లిన తర్వాత సీల్డ్ కవర్ తెరిచి చూస్తే టార్గెట్ ఎవరు, అడ్రస్ ఎక్కడ అనేది తెలుస్తుంది.. స్ట్రైక్ టైం ఆధారంగా సోదాలు జరపాల్సి ఉంటుంది. మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలు, విద్యా సంస్థల్లో స్ట్రైక్ టైం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలుగా నిర్ధారించారు. సరిగ్గా అదే సమయానికి అన్నిచోట్ల సోదాలు ప్రారంభమయ్యాయి. స్ట్రైక్ టైం సరిగా లేకుంటే లక్షిత వ్యక్తులు అన్ని సర్దుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టే ఐటి శాఖ ఈ నిర్ణయం తీసుకుంటుంది. సోదాల సమయంలో గతంలో స్థానిక పోలీసుల సహకారం తీసుకునేవారు.. ముందుగానే వారికి విషయం చెప్పాల్సి రావడం వల్ల కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తికి సమాచారం వెళ్లినట్టు గుర్తించారు. దీంతో ఐటీ సోదరుల సమయంలో స్థానిక పోలీసులు కాకుండా కేంద్ర భాగాలను వెంట తీసుకెళ్తున్నారు.. దాడులకు కొన్ని గంటల ముందు సిఆర్పిఎఫ్ బలగాలు ఐటీ కార్యాలయానికి చేరుకుంటాయి. ఇక ఒక వ్యక్తి సంబంధించి సోదాలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఐటీ శాఖ “డాట్ టు డాట్ కనెక్షన్” అనే విధానాన్ని అనుసరిస్తుంది.. అంటే ఆ వ్యక్తి, అతడి సమూహం, అతడు సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తుల ఆధారంగా వివరాలు సేకరిస్తారు.. ఇక ఐటీ అధికారులు కేవలం సోదాలు నిర్వహించడం, లెక్కలు సరి చూడడం, లెక్కల్లో లేని నగదు, నగల్ని స్వాధీనం చేసుకోవడం వరకే పరిమితం అవుతారు.. పోలీస్ కేసులు నమోదు చేయడం వారికి సాధ్యం కాదు.