Meat: మాంసం మాంసాన్ని పెంచుతుంది కానీ మంచిని కాదు. మాంసం తిన్న జంతువులు మత్తుగా ఉంటాయి. శాఖాహారం తీసుకునే జంతువులు చలాకీగా ఉంటాయి. తినే ఆహారంలోనే ఉంటుంది దాని గుణం. సహజంగా మాంసాహారం తీసుకునేవి జంతువులు. శాఖాహారం తీసుకునే వారు మనుషులు. కానీ మనిషి మాంసం కోసం తెగ ఆరాటపడుతున్నాడు. మాంసాహారం తీసుకునే జంతువులు నాలుకతో నీళ్లు తాగుతాయి. శాఖాహారం తీసుకునే జంతువులు నోటితో తాగుతాయి. మనిషి కూడా నోటితోనే తాగడం తెలిసిందే. పైగా మాంసాహార జంతువులకు మాంసం కుళ్లినా మంచి వాసనే వస్తుందట. కానీ మనకు చెడు వాసన వస్తుంది. అందుకే ముక్కు మూసుకుంటాం. అందుకే మనిషి శాఖాహార జంతువే అని తెలుసుకోవాలి. మాంసంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయని తెలిసినా ఎవరు కూడా ఆగడం లేదు. తెల్లారింది మొదలు ముక్క కోసం దుకాణాల వద్ద గుమిగూడుతున్నారు.

Meat
మాంసాహారంతో ఎన్నో రోగాలు వస్తాయి. బీపీ, షుగర్, గుండెజబ్బులు అన్ని కూడా మాంసాహారంతోనే వస్తాయని తెలిసినా దాన్ని తినడం మాత్రం మానడం లేదు. అన్ని రోగాలకు మూలం మాంసాహారమే అని ఓ పక్క వైద్యులు సూచిస్తున్నా ఎందుకు తినడానికి తాపత్రయ పడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో మాంసం తినే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. దీంతో మాంసం ధర కూడా పెరుగుతూనే ఉంది. గతంలో ఉన్న ధరలకు ఇప్పటి ధరలకు తేడా ఉంది. రోజురోజుకు ధరలు పెంచుకుంటూ పోతున్నారు.
Also Read: Modi HYD Tour హైదరాబాద్ పర్యటనలో 17 ప్రశ్నలతో మోడీకి షాకిచ్చిన టీఆర్ఎస్
దేశంలోని రాష్ట్రాలతోపాటు రెండు తెలుగు రాష్ర్టాల్లో మాంసాహారుల సంఖ్య ఎక్కువవుతోంది. 96 శాతం మంది మాంసాహారులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మటన్, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకుంటున్నారు. జబ్బులకు మూల కారణమైనా మాంసం తీసుకోవడానికి వెనుకాడటం లేదు. ఫలితంగా రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఏమైనా అంటే ఏదో ఉన్నన్ని రోజులు సుఖంగా తిని పోయేదానికి ఇవన్నీ ఎందుకని మనకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.

Meat
మాంసం తీసుకునే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా 77 శాతం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 96 శాతం, లక్ష్యద్వీప్ లో వంద శాతం, రాజస్థాన్ లో అత్యల్పంగా 31 శాతం మంది మాంసాహారులున్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. దీంతో మాంసాహార ప్రియులు ఎంత మంది ఉన్నారో తెలుస్తోంది కదా. మాంసాహారం వీలైనంత వరకు మానేస్తేనే మనుగడ బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ క్రమంలో మాంసాహార ప్రియులు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కొవ్వు పెరిగిపోయి రోగాలు రావడానికి మాంసమే ప్రధానంగా కారణమవుతోంది. దీంతో మాంసాహారం వదిలేస్తేనే మనకు శ్రేయస్కరమనే సంగతి గుర్తుంచుకుంటే మంచిది.
Also Read:Jai Balayya: అరెరే.. ‘అన్నగారు` వద్దు, ‘జై బాలయ్య’ ముద్దు !
Recommended Videos: