Ice Cream: అన్నం తిన్న తరువాత ఐస్ క్రీం తింటున్నారా?
అన్నం తినేటప్పుడు కొందరు చేయకూడని పనులు చేస్తుంటారు. ముఖ్యంగా ఇతర పనులతో బిజీగా ఉండడం వల్ల గబగబా ఆహారన్ని తింటుంటారు. అన్నం నోట్లో వేసుకున్న తరువాత కనీసం 30 సెకన్లపాటు నమలాలి.

Ice Cream: రోజులో ఒక్కసారైన అన్నం తినకపోతే కడుపు నిండినట్లు అనిపించదు. కొన్ని ప్రాంతాల్లో కేవలం చపాతీలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుండగా.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకుంటారు. ఈ ఆహారం వల్ల ఎనర్జీ తక్కవే అయినా కడుపునిండినట్లు కావడానికి వీటినే ఎక్కువగా తీసుకుంటారు. అయితే అన్నం తినే ముందు.. ఆ తరువాత కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు కొందరు వైద్యులు. మరి అన్నం తినే సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదో తెలుసుకుందాం..
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ప్రతి రోజూ ఒక్కసారైనా అన్నం తిననిదే రోజూ గడవదు కొందరికి. అయితే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చే ఆహార పదార్థాలు రసాయనాలతో నిండి ఉండడం వల్ల ఇవి ఎనర్జీకి డిసీజ్ ను తెస్తున్నాయి. అందువల్ల కడుపు నిండడానికి ఆహారాన్ని తింటూనే ఎక్కువగా పోషకాలు ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ కూరలు ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయాలి.
అన్నం తినేటప్పుడు కొందరు చేయకూడని పనులు చేస్తుంటారు. ముఖ్యంగా ఇతర పనులతో బిజీగా ఉండడం వల్ల గబగబా ఆహారన్ని తింటుంటారు. అన్నం నోట్లో వేసుకున్న తరువాత కనీసం 30 సెకన్లపాటు నమలాలి. అలాగే అన్నం కలిపేటప్పుడు కూడా బాగా పిండి పదార్థం అయ్యేలా చేయాలి. బాగా నమిలిని ఆహారాన్ని మింగడం వల్ల జీర్ణక్రియ మెరుగుదల ఉంటుంది. అలా కాకుండా గబగబా తినడం వల్ల జీర్ణం కాక ఇబ్బందులు ఎదువుతాయి.
బియ్యంతో వండిన ఆహారంతో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణం కావడానికి కొంచెం సమయం పడుతుంది. అటువంటప్పుడు ఇది తినే ముందు అజర్తి చేసే పదార్థాలు తీసుకోవడం అంత మంచికాదని వైద్య నిపుణులు చెబుుతున్నారు. ముఖ్యంగా అన్నం తినే ముందు టీ లేదా పాలు తాగుతారు. ఇలా చేయడం వల్ల కడులో జీర్ణ వ్యవస్థ దెబ్బతిని తిన్న ఆహారం డైజేషన్ కాకుండా ఉంటుంది.
ఇక అన్నం తిన్న తరువాత ఐస్ క్రీం లాంటివి తింటూంటారు. ఇలా తిండే బరువు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇవి కూడా తిన్న ఆహారం జీర్ణ క్రియ కాకుండా సమస్యలు తెస్తుంది. అందువల్ల అన్నం తీసుకునే ముందు, తిన్న తరువాత దాదాపు ఎటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉండడమే మంచిదని అంటున్నారు.
