Black Grapes: నల్ల ద్రాక్షలు తింటున్నారా? ఒక్క క్షణం ఆగండి.. ఇవి తెలుసుకోండి..
నల్ల ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. ఓ పరిశోధన ప్రకారం గ్రేప్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

Black Grapes: వాతావరణంలో మార్పులతో కొత్త కొత్త రోగాలు వస్తున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో శరీరానికి ఆహారంతో పాటు అధిక శక్తి ఇచ్చే ఇతర పదార్థాలు తింటూ ఉండాలి. కొందరు రుచికోసం జంక్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు. కానీ వీటి కంటే ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అదనపు శక్తిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. మార్కెట్లో ఏ కాలంలోనైనా దొరికే ఫ్రూట్స్ నల్ల ద్రాక్ష. వీటిని నేరుగా లేదా జ్యూస్ ద్వారా తీసుకోవడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. ఇంతకీ ద్రాక్షలో ఉండే ఆరోగ్య గుణాలేంటో తెలుసుకుందాం.
నల్ల ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. ఓ పరిశోధన ప్రకారం గ్రేప్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు నల్ల ద్రాక్ష తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
డైట్ చేసేవారు నల్ల ద్రాక్ష తీసుకుంటే శరీరం అలసటగా ఉండకుండా చేస్తుంది. ద్రాక్షలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇవి ఎముకలను బలంగా ఉండేలా చేస్తుంది. పాలీ ఫెనాల్స్ రక్తంలోని చక్కెర నిల్వలను కంట్రోల్ చేస్తుంది. ద్రాక్ష తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. అందువల్ల వీటిని అప్పుడప్పుడు పిల్లలకు తినిపిస్తూ ఉండాలి. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు ద్రాక్షనుతీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇక ద్రాక్ష దీర్ఘాయువు పెంచుతుందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు.
నల్ల ద్రాక్షను తీసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి కాస్త చేదుగా అనిపిస్తాయి. అలాంటి వారు జ్యూస్ చేసి తాగవచ్చు. ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఆకలి పెరుగుతంది. నోరు టేస్టీగా ఉండి ఎలాంటి ఇన్ఫెక్సన్ కాకుండా ఆపుతుంది. అయితే చాలా మంది ఇవి మార్కెట్ నుంచి తీసుకొచ్చి నేరుగా తింటున్నారు. వీటిని ఇంటికి తెచ్చుకున్న తరువాత శుభ్రంగా కడిగిన తరువాతే తీసుకోవాలి. ఎందుకంటే వీటిపై ఉండే చిన్న బ్యాక్టీరియా అనారోగ్యానికి గురిచేస్తుంది.
