AP Early Elections: ఎన్నికల ముందు విచ్చలవిడిగా డబ్బు పంచెద్దాం. ప్రజలను ఫుల్ శాటిస్ ఫై చేసి ఓట్లు గుంజుకుందాం. ఆ తరువాత సంగతి చూద్దాం.. అన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో అధికార పార్టీ ముందస్తుకు వెళుతుందన్న అనుమానాలనేపథ్యంలో ప్రభుత్వం మరో ఆలోచనలో ఉందన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. ముందస్తు కూడా పక్కా ప్లాన్ తోనే వెళ్లాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొందిన జగన్..ఈసారి 175 స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్.. ఇలా అందర్నీ ఓడించి తీరుతామంటున్నారు. పార్టీ వర్గాలకు సైతం ఇదే చెబుతూ వచ్చారు. అయితే గ్రౌండ్ లెవల్లో పరిస్థితి చూస్తున్న వారు.. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం అది నాకు వదిలేయ్యాండన్న రేంజ్ లో మాట్లాడుతుండడం= సొంత పార్టీ శ్రేణులకు అర్ధం కాని పరిస్థితి. జగన్ ధైర్యం చేయడానికి కారణమేమిటబ్బా అని వారు ఆలోచిస్తున్నారు.

JAGAN
175 స్థానాల మాట అటుంచితే.. పార్టీ గ్రౌండ్ లెవల్లో బాగా వీకయ్యిందని పీకే టీమ్ జగన్ కు నివేదించిందట. ప్రజా వ్యతిరేకతకు తోడు విపక్షాలు బలం పెంచుకున్నాయని చెప్పడంతో జగన్ షాక్ కు గురయ్యారుట. అయితే దీనిని అధిగమించడం ఎలా? అనేసరికి పీకే టీమ్ అద్భుతమైన సలహా ఇచ్చిందట. అది నచ్చిన జగన్ దానికే ఫిక్స్ అవుతున్నారు. ఇంతలో పార్టీ నియోజకవర్గ బాధ్యుల చేతిలో ఓ రోడ్డు మ్యాప్ పెట్టి అందుకు అనుగుణంగా పనిచేయాలని చెప్పనున్నారుట. అందుకే ఈ నెల 8న పార్టీ కీలక సమావేశం నిర్వహించిన నేతలకు దిశ నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. పీకే టీమ్ చెప్పిన ఆ ప్లాన్ పై పార్టీ వర్గాల నుంచి అభిప్రాయం కోరే అవకాశముంది. అప్పుడే ముందస్తు ఎన్నికలకు ఎప్పుడు వెళుతుంది? అందుకు గల కారణాలు తెలియజేయనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం.
అయితే పీకే టీమ్ ఏం చెప్పింది? అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ముందస్తుకు వెళితేనే అత్తెసరు మెజార్టీతోనైనా గట్టెక్కగలరని పీకే టీమ్ జగన్ చేతిలో ఒక నివేదిక పెట్టినట్టు తెలుస్తోంది. సరిగ్గా బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ముందస్తు ప్రకటన చేయాలని సూచించిందట. అప్పటికే ఎన్నికలకు నాలుగు నెలల వ్యవధి ఉంటుంది. అప్పటికే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కొత్తగా అప్పులు తెచ్చేందుకు చాన్స్ లభిస్తుంది. కేంద్రం ముందస్తు అనుమతి తీసుకుంటే కనీసం రూ.60వేల కోట్లు అప్పు పుట్టే అవకాశముంది. ఆ మొత్తంతో విచ్చలవిడిగా పథకాలు రూపొందించి ప్రతీ ఓటరు ఖాతాలో నగదు జమ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని పీకే టీమ్ సూచించడంతో జగన్ తెగ ఖుషీ అయ్యారట. అందుకే 8వ తేదీన పార్టీ నేతలతో సమావేశమై.. నేరుగా జగన్ ఢిల్లీ బాట పట్టనున్నారు. అక్కడే పీకే టీమ్ ప్లాన్ ను వర్కవుట్ చేయనున్నారు.

JAGAN
మరోవైపు టీడీపీ, జనసేన కలిసే చాన్స్ కూడా ఇవ్వకుండా జగన్ పావులు కదుపుతున్నారు. కేంద్రం వద్ద తనుకున్న పలుకుబడిని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పోనీ ఆ రెండు పార్టీలు కలిసినా,,, కింది స్థాయి కేడర్ కలువకుండా చాలారకాల ప్లాన్లు జగన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు పథకాల ద్వారా ప్రజలను, తన మాట ద్వారా కేంద్రాన్ని ఆకట్టుకోవడంతో పాటు టీడీపీ, జనసేనలో అనిశ్చితి సృష్టించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం ముందుగానే పసిగట్టిన జనసేన, టీడీపీలు జాగ్రత్త పడినట్టు కూడా టాక్ వినిపిస్తోంది. అందుకే రాజకీయ అంశాలు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులకు హైకమాండ్లు హెచ్చరికలు పంపాయి. అయితే జగన్ ముందస్తు స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.