Biryani Health Problems: ఆహార పదార్థాలు కల్తీగా చేస్తున్నారు. బయట దొరికే వాటిని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. పొరపాటున మనకు ఆకలి వేసినప్పుడు హోటల్ కు వెళ్లి తింటుంటాం. కానీ వారు వాడే పదార్థాలు చూస్తే మనకు అసహ్యమే కానీ ఆనందం మాత్రం కలగదు. దీంతో మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. ఇటీవల కాలంలో ఎవరు పట్టించుకోవడం లేదు. హోటళ్లలో బిర్యాణీలతో పాటు ఇతర పదార్థాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.

Biryani Health Problems
హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో సంచార ప్రయోగశాలను ఇటీవల జీహెచ్ఎంసీ ప్రారంభించింది. ఇందులో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, తోపుడు బండ్లు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అందులో నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. వారు వాడే పదార్థాలు చూసి ఆశ్చర్యపోయారు. అధికారులే విస్మయం చెందారు. ఇంత దారుణమైన కల్తీ పదార్థాలు వాడితే ఆరోగ్యం పాడైపోవడం ఖాయమని చెబుతున్నారు. పొరపాటున కూడా బయట తిండ్లు మంచివి కాదని తేల్చారు.
జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు వంద చోట్ల తనిఖీలు చేయగా చాలా చోట్ల కల్తీ వాటిని వాడుతున్నట్లు తేలింది. దీంతో ప్రజలు చైతన్యం తెచ్చుకుని బయట తిండ్లకు ఆకర్షితులు కావద్దని సూచిస్తున్నారు. బిర్యాణీలు అయితే లెక్కలేనన్ని అమ్ముతున్నారు. అందులో వాడే వాటిని చూస్తే భయం కలిగిస్తోందని చెబుతున్నారు. జర జాగ్రత్త సుమా. బయట తిండ్లకు విరామం ఇవ్వండి. ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యానికి ఆరోగ్యం శుభ్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బీ కేర్ ఫుల్ హోటళ్ల ఫుడ్స్ కు టాటా చెప్పేయండి.

Biryani Health Problems
ఇప్పటికే చాలా సర్వేలు కూడా తెలియజేశాయి. హోటళ్లలో తినడం సురక్షితం కాదని తేల్చేశాయి. ఇప్పుడు తనిఖీల్లో బయట పడిన సందర్భంలోనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కల్తీ నూనె వాడటంతో పదార్థాలు విషతుల్యంగా మారే సూచనలున్నాయి. వాడిన నూనెనే మళ్లీ వాడుతుంటారు. దీంతో క్యాన్సర్ ముప్పు ఏర్పడుతుంది. నూనెను ఒకసారి వేడి చేస్తే దాన్ని పక్కన పెట్టాలి. కానీ వారు అలా కాదు. ఒకసారి వేడి చేసిన నూనెను పదేపదే అందులోనే కాల్చుతూ వంటలు చేస్తుంటారు. దీంతో మనకు ఎంతో నష్టం కలుగుతుందని భావించుకోవాలి. బిర్యాణీకు ఆకర్షితం కాకుండా ఇంట్లోనే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.