Balakrishna: బాలయ్య మూవీలో ఆ స్టార్ హీరో… సౌత్ ఇండియాను షేక్ చేసే న్యూస్!

దసరా బరిలో భగవంత్ కేసరిగా దిగిన బాలకృష్ణ విజయం అందుకున్నారు. తన ఇమేజ్ కి భిన్నమైన రోల్ లో ఆకట్టుకున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి భగవంత్ కేసరి దర్శకుడు. శ్రీలీల కీలక రోల్ చేసింది.

  • Written By: NARESH
  • Published On:
Balakrishna: బాలయ్య మూవీలో ఆ స్టార్ హీరో… సౌత్ ఇండియాను షేక్ చేసే న్యూస్!

Balakrishna: బాలయ్య జోరు మీదున్నాడు. ఎన్నడూ లేని విధంగా హ్యాట్రిక్ కొట్టాడు. గత రెండు దశాబ్దాల్లో బాలకృష్ణ వరుస హిట్స్ ఇచ్చింది లేదు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అఖండ ముందు వరకు బాలయ్య పరిస్థితి దారుణంగా ఉంది. పట్టుమని పదికోట్ల వసూళ్లు కూడా రావడం లేదు. ఆయన సినిమా అంటే థియేటర్స్ వైపు జనాలు వెళ్లడమే మానేశారు. అలాంటి పరిస్థితిని నుండి బయటపడ్డాడు.

దసరా బరిలో భగవంత్ కేసరిగా దిగిన బాలకృష్ణ విజయం అందుకున్నారు. తన ఇమేజ్ కి భిన్నమైన రోల్ లో ఆకట్టుకున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి భగవంత్ కేసరి దర్శకుడు. శ్రీలీల కీలక రోల్ చేసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్. మూవీ విడుదలై నెల రోజులు గడవక ముందే కొత్త మూవీ సెట్స్ లో అడుగుపెట్టాడు బాలకృష్ణ. 109వ చిత్రం దర్శకుడు బాబీతో ప్రకటించాడు. ఈ మూవీ నవంబర్ 8 నుండి షూటింగ్ జరుపుకుంటుంది.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాబీ భారీగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో నటించే నటుల వివరాలు తెలియాల్సి ఉంది. బాలకృష్ణతో కూడిన కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా NBK 109 పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్ లో మరో స్టార్ హీరో భాగం అవుతున్నాడట. ఆయన ఎవరో కాదు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. దర్శకుడు బాబీ ఓ కీలక రోల్ కోసం దుల్కర్ ని సంప్రదించారట.

ఆయన కూడా పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో బాలయ్య-దుల్కర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖాయం అంటున్నారు. ఇది బాలయ్య సినిమాకు కలిసొచ్చే అంశం. దుల్కర్ కి మాలీవుడ్ తో పాటు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా ఇమేజ్ ఉంది. కాబట్టి బాలయ్య సినిమాకు మంచి ప్రచారం దక్కుతుంది. గొప్ప నటుడిగా పేరున్న దుల్కర్ తన పాత్రతో సినిమాను ఎలివేట్ చేస్తారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు