KCR- BRS Minister Medical College: అన్నిసార్లు మనం నక్కతోక తొక్కుతామని అనుకోవద్దు.. అన్నిసార్లు మనం అనుకున్నదే జరగాలని ఏమీ లేదు.. కొన్నిసార్లు భూమారాంగ్ అవుతుంది. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.. ఇదంతా కూడా భారత రాష్ట్ర సమితికి చెందిన ఓ మంత్రికి అవగతమైంది.

KCR- BRS Minister Medical College
ఆయన తన రాజకీయ జీవితాన్ని 2014లో ప్రారంభించారు. వాళ్ల నాన్న కమ్యూనిస్టు నాయకుడిగా పేరుగాడించాడు.. కమ్యూనిస్టు పార్టీని అడ్డం పెట్టుకొని మెడికల్ కాలేజీ, స్థలాలు గట్రా భారీగా సంపాదించాడు.. కమ్యూనిస్టు పార్టీలో ఉన్న తండ్రి అంత సంపాదిస్తే… బూర్జువా పార్టీలోకి (కమ్యూనిస్టులు పెట్టిన పేరు) వెళితే మరింత సంపాదించవచ్చని ఆయన కొడుకు అనుకున్నాడు.. అనుకున్నట్టుగానే 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు.. అంతలోనే భారత రాష్ట్ర సమితిలో చేరాడు.. తర్వాత సంపాదనను మెరుగుపరుచుకున్నాడు.. తన స్థానాన్ని పదిల పరుచుకున్నాడు. అంతేకాదు గులాబీ కండువా కప్పుకుంటున్నప్పుడే తన మెడికల్ కాలేజీకి పోటీగా ఇంకే మెడికల్ కాలేజీ ఏర్పాటు కావద్దని అప్పట్లోనే అధినేత వద్ద గట్టి హామీ తీసుకున్నాడు.. ఇక అప్పటినుంచి ఆయన హవాకు అడ్డే లేకుండా పోయింది.
ఈలోగా అధినేత ప్రభుత్వాన్ని రద్దు చేశాడు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు.. సేమ్ ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు.. అధినేత కొడుకుకు సన్నిహితుడుగా మారిపోయాడు.. అంతే దెబ్బకు ఈయన రాజకీయ జీవితం కూడా మారిపోయింది.. తంతే గారెల బుట్టలో పడ్డట్టు మంత్రి అయ్యాడు. ఆయన అదృష్టమేంటో గాని… సొంత పార్టీలో తనకు పోటీ వస్తారు అనుకునేవారు ఎన్నికల్లో ఓడిపోయారు.. లక్కీగా జిల్లా నుంచి ఒక్కడే గెలవడంతో మంత్రిపదవి వరించింది. దీంతో ఆ మంత్రి మరింత రెచ్చిపోయాడు.. తరాలు తిన్న తరగనంత ఆస్తి సంపాదించాడు.. అంతేకాదు తన జిల్లాలో ఎదురు లేకుండా చేసుకున్నాడు.. రాజకీయంగా మరింత బలం పెంచుకున్నాడు.. అంతేకాదు మెడికల్ ద్వారా ఆదాయం ఎంతలా ఉంటుందో తెలుసుకున్న ఆయన… ఏకంగా హైదరాబాద్ నగర శివారులో మెడికల్ కాలేజ్ నిర్మించాడు. అంతేకాదు ఇందులో అధినేత కొడుకు కూడా వాటా ఇచ్చాడు. మరో వైపు అధినేత కొడుకును పలుమార్లు తన నియోజకవర్గానికి పిలిపించుకున్నాడు.

KCR
అంతా బాగున్నది అనుకున్న సమయంలోనే అధినేత జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేశాడు.. దీంతో ఆ మంత్రికి కాళ్ళకింది భూమి కనిపించినట్టు అయ్యింది.. పైగా ఆ మంత్రి సోదరుడు గతంలో మృతి చెందిన నేపథ్యంలో.. తన సొంత జిల్లాలో మెడికల్ కాలేజీని తన సోదరుడి భార్య చూసుకుంటున్నది. ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో… మంత్రి కాలేజీకి డిమాండ్ తగ్గింది.. పైగా హైదరాబాద్ నగర శివారులో ఉన్న మెడికల్ కాలేజీకి డిమాండ్ పెరిగింది. దీంతో సొంత జిల్లాలోని మెడికల్ కాలేజీని తన అన్న భార్యకు అప్పగించాడు. అధినేత పై ఆగ్రహం ఉన్నప్పటికీ తన రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కోపాన్ని పంటి బిగువన భరిస్తున్నాడు.. ఇక్కడ కాలేజీని ఎలాగూ వదినకు అప్పగించి ఆస్తి సమస్యను కూడా పరిష్కరించుకున్నాడు.. ఇందులో కోల్పోయిన డబ్బును హైదరాబాద్ మెడికల్ కాలేజీ రూపంలో దండుకుంటున్నాడు. ఇలా ఒక్క మెడికల్ కాలేజీ దెబ్బకు ఆ మంత్రి ఫేట్ మారిపోయిందనే చెప్పాలి..