Lowest Rainfall In August: గడ్డు ఆగస్టు.. 132 ఏళ్ళల్లో ఇదే అత్యల్పం

భారత్‌లో భూగర్భజలాల వాడకం ప్రస్తుతం ఉన్న స్థాయిలో కొనసాగితే, 2080 కల్లా అవి 3 రెట్ల మేర తరిగిపోతాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ పరిశోధకులు హెచ్చరించారు. అదే జరిగితే ఆహార, నీటి భద్రతకు ప్రమాదం తప్పదని స్పష్టం చేశారు.

  • Written By: Bhaskar
  • Published On:
Lowest Rainfall In August: గడ్డు ఆగస్టు.. 132 ఏళ్ళల్లో ఇదే అత్యల్పం

Lowest Rainfall In August: వానాకాలం ఎండాకాలం అయింది. ముంచెత్తే వానాలకు బదులు మాడు పగిలేలా ఎండ దంచి కొట్టింది. ఫలితంగా నైరుతి రుతుపవనాల సీజన్‌కు కీలకమైన ఆగస్టు నెలలో ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. పైగా వేసవి మాదిరి ఎండ తీవ్రత నెలకొనడంతో దేశంలో ఖరీఫ్‌ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారత వాతావరణ శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకా రం… ఆగస్టుకు సంబంధించి 1901 నుంచి పరిశీలిస్తే ఈ ఏడాది అతి తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరంగా రికార్డయింది. 1971-2000ను ప్రాతిపదికగా తీసుకుంటే దేశవ్యాప్తంగా ఆగస్టులో సగటున 254.9 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా 162.7 మి.మీ.(సాధారణం కంటే 36ు తక్కు వ) మాత్రమే నమోదైంది. అంతకుముందు 2005లో 191.2 మి.మీ. పడింది. అనేక ప్రాం తాల్లో వేస వి వాతావరణం కొనసాగడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.1 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆగస్టులో ఎండలు, వర్షాభావం, కుంభవృష్టి తదితర అంశాలపై ఐఎండీ బులెటిన్‌ విడుదల చేసింది. ఈ ఆగస్టులో దక్షిణ భారతంలో 190.7 మి.మీ.కు గాను కేవలం 76.4 మి.మీ. (సాధారణం కంటే 60ుతక్కువ) వర్షపాతం నమోదైంది. గడచిన 122 ఏళ్లలో ఇదే అత్యంత తక్కువ. గతంలో 1968లో 89.4 మి.మీ. కురిసింది. ఆగస్టులో బంగాళాఖాతంలో 16రోజుల పాటు కొనసాగేలా ఐదు అల్పపీడనాలకు గాను ఈ ఏడాది 2 అల్పపీడనాలు ఏర్పడి 9 రోజులు కొనసాగాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో రుతుపవనాలు అత్యంత బలహీనంగా ఉన్నాయి.

మాయమవుతాయి

భారత్‌లో భూగర్భజలాల వాడకం ప్రస్తుతం ఉన్న స్థాయిలో కొనసాగితే, 2080 కల్లా అవి 3 రెట్ల మేర తరిగిపోతాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ పరిశోధకులు హెచ్చరించారు. అదే జరిగితే ఆహార, నీటి భద్రతకు ప్రమాదం తప్పదని స్పష్టం చేశారు. ఈ అంశంలో వారు చేసిన అధ్యయనానికి సంబంధించిన వివరాలను సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘వర్షాభావ పరిస్థితులు తరచూ ఏర్పడుతుండటంతో భూగర్భజలాలను వాడుకోవడంపై భారత రైతులు దృష్టి సారించారు. దీని వల్ల ప్రస్తుతం అవసరాలు తీరుతున్నా, మున్ముందు ఇది దేశంలో సుమారు 33శాతం మంది ప్రజలపై ప్రభావం చూపించవచ్చు.

భూగర్భజలాల వాడకంలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. భారత భూగర్భజలాలు తరిగిపోతే, ప్రపంచానికీ ఆందోళనకరమే. అధ్యయనంలో భాగంగా దేశంలోని భూగర్భజలాల స్థాయులపై చారిత్రక సమాచారాన్ని, పర్యావరణ మార్పును, జలాల వాడకం తీరును, ఉపగ్రహ సమాచారాన్ని పరిశీలించి భవిష్యత్తును అంచనా వేశాం. వాతావరణం వేడెక్కెతున్న తీరు, నీటి వాడకం ప్రకారం మూడు రెట్లకు పైగా భూగర్భజలాలు 2080నాటికి కనుమరుగవుతాయని భావిస్తున్నాం. భూగర్భజలాలను పరిరక్షించేలా ప్రభుత్వాలు సమర్థ విధానాలను తీసుకురావడం ఇప్పుడు అత్యవసరం’’ అని పరిశోధకులు స్పష్టం చేశారు.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు