Donate This Dress: మనకు ఏవైనా పనులు కాకుండా శని దోషం పట్టిందని చెబుతారు. శని అంతటి ప్రమాదకరమైన దేవుడిగా భావిస్తారు. అందుకే శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునే క్రమంలో భక్తులు నానా యాతనలు పడుతుంటారు. శనీశ్వరుడిని ఎలా కొలవాలో ఏం పెడితే ప్రసన్నుడు అవుతాడో తెలుసుకునేందుకు తాపత్రయ పడుతుంటారు. ఇందులో భాగంగానే శనీశ్వరుడిని తమ భక్తితో కొలుస్తూ తమ కోరికలు తీర్చాలని కోరుకోవడం మామూలే. శనీశ్వరుడి పుట్టుపూర్వోత్తరాలపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.

Saneeswara
సూర్యుడు దక్షప్రజాపతి కుమార్తె సంధ్యను వివాహం చేసుకుని మను, యముడు, యమున అనే ముగ్గురు పిల్లలు జన్మిస్తారు. దీంతో సంధ్యా దేవి సూర్యుడి వేడిని భరించలేక తన నీడ (ఛాయ)ను తన రూపంలో ఉంచి పుట్టింటికి వెళ్తుంది. సూర్యుడు ఛాయదేవితో కూడా సంసారం చేసి ఓ కుమారుడిని కంటాడు. ఆయన శనీశ్వరుడు. శని నల్ల రూపులో ఉండటంతో అతడిని అందరు అసహ్యించుకుంటారు. సూర్యుడు కూడా శనిని దూరం పెడతాడు. దీంతో శని ఓ సారి సూర్యుడి వైపు చూడగా నల్లగా మారిపోతాడు.
Also Read: Rashmika Mandana: రష్మిక ఐ లవ్ యూ.. థోడా స్పైసీ థోడా సెక్సీ !
దీంతో సూర్యుడు తన తప్పు తెలుసుకుని శనీశ్వరుడు నవగ్రహాల్లో పెద్దగా ఉంటాడని చెబుతాడు. అప్పటి నుంచి శనీశ్వరుడికి అన్ని నలుపు రంగుతో ఉన్నవాటినే నైవేద్యంగా పెడతారు. నల్ల నువ్వులు, నల్ల శనగలు, ఇనుము, అన్ని నల్లటివే పెడతారు. శనీశ్వరుడి కోరిక మేరకే నలుపు రంగు వస్తువులు పెడితే ప్రసన్నుడు అవుతాడని ప్రతీతి. అందుకే శనీశ్వరుడిని నల్లటి వాటితో కొలుస్తారు. ఇంతటి మహత్తర శక్తి గల శనీశ్వరుడిని కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. శనికి నల్లటి వస్తువులు పెడితే ఇష్టంగా స్వీకరించి మనకు మంచి చేస్తాడని నమ్మకం. అందుకే నల్లటి వాటిని ఆయనకు నైవేద్యంగా పెట్టడం తెలిసిందే. భక్తుల ప్రగాఢ విశ్వాసంతో శనికి పూజలు చేస్తుండటం విశేషం.
అందుకే నవగ్రహాల పూజలో ముందుగా శనికే అగ్రతాంబూలం. మనిషి మనుగడలో శని ఉంటే మన దారికి అడ్డం తగులుతుందనే ఉద్దేశంతోనే మనకు మంచి శకునాలు కలగాలని శనిని వేడుకుంటారు. ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసంలోని అమావాస్య రోజును శని జయంతిగా జరుపుకుంటారు. ఆ రోజున దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి శనీశ్వరుడి కోసం పూజలు చేస్తారు. శని తమకు మంచి చేయాలని వేడుకోవడం ఆనవాయితీ. శనీశ్వరుడిని తమ ఇంట్లో శుభాలు కలిగించాలని కోరుకోవడం సహజమే
Also Read: Ashu Reddy: అషు రెడ్డి వీడియో పై ట్రోల్స్.. ఆ కామెంట్స్ దారుణం !
Recommended Videos: