Upasana: ఉపాసన మరో బిడ్డను కంటుందా? ఈసారైనా మగపిల్లాడి కల తీరుతుందా?
రామ్ చరణ్ కి అమ్మాయి పుట్టింది. అది సంతోషకర విషయమే, అయితే అబ్బాయి కూడా కావాలంటున్నారు. ఒక బిడ్డను కనేందుకు ఈ జంట పదేళ్ల సమయం తీసుకున్నారు. మరో బిడ్డను కంటారా? ఒక వేళ ఒక బిడ్డతో సరిపెడితే పరిస్థితి ఏంటనే సందేహాలు మొదలయ్యాయి. అందుకే రామ్ చరణ్ కి మొదటి సంతానంగా అబ్బాయి పుడితే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు.

Upasana: రామ్ చరణ్ తండ్రి అయ్యారు. పదేళ్ల నిరీక్షణకు దక్కిన ఫలితం కావడంతో సంబరాలు మిన్నంటాయి. జూన్ 20వ తేదీ ఉదయాన్నే ఉపాసన ఆడపిల్లకు జన్మనిచ్చింది. హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ లో ఉపాసనకు డెలివరీ అయ్యింది. నిద్రలేస్తూనే ఉపాసన-రామ్ చరణ్ పేరెంట్స్ అయ్యారంటూ కథనాలు దర్శనమిచ్చాయి. మెగా అభిమానులు ఈ వేడుకను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. అయితే వారికి ఒక విషయంలో నిరాశ ఎదురైంది. రామ్ చరణ్ కి అబ్బాయి పుడితే నటన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం దక్కేదని వారు వాపోతున్నారు.
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిరంజీవి కేవలం ప్రతిభతో స్టార్ అయ్యారు. దశాబ్దాల పాటు తిరుగులేని హీరోగా పరిశ్రమను ఏలారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎవరూ అందుకోని అరుదైన గౌరవాలు అందుకున్నాడు. మైలురాళ్లు చేరుకున్నాడు. ఏకంగా ఆస్కార్ విన్నింగ్ మూవీ హీరోగా అవతరించాడు. మరి ఇంత ఘన చరిత్ర కలిగిన మెగా ఫ్యామిలీ నట వారసత్వాన్ని నిలపాల్సిన బాధ్యత రామ్ చరణ్ పై ఉంది.
కానీ రామ్ చరణ్ కి అమ్మాయి పుట్టింది. అది సంతోషకర విషయమే, అయితే అబ్బాయి కూడా కావాలంటున్నారు. ఒక బిడ్డను కనేందుకు ఈ జంట పదేళ్ల సమయం తీసుకున్నారు. మరో బిడ్డను కంటారా? ఒక వేళ ఒక బిడ్డతో సరిపెడితే పరిస్థితి ఏంటనే సందేహాలు మొదలయ్యాయి. అందుకే రామ్ చరణ్ కి మొదటి సంతానంగా అబ్బాయి పుడితే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు.
అలాగే చిరంజీవి కుటంబాన్ని ఓ సెంటిమెంట్ వెంటాడుతుంది. ఆయనకు అందరూ మనవరాళ్లే పుడుతున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితకు ఇద్దరూ అమ్మాయిలే. అలాగే రెండో అమ్మాయి శ్రీజా కూడా మగ బిడ్డను కనలేకపోయింది. ఆమెకు కూడా ఇద్దరు అమ్మాయి. మరలా రామ్ చరణ్ కూతురు రూపంలో చిరంజీవికి మనవరాలు దక్కింది. మొత్తంగా ఆయనకు ఐదుగురు మనవరాళ్లు అయ్యారు. ఈ క్రమంలో ఉపాసన, రామ్ చరణ్ దంపతులు వెంటనే మరో బిడ్డను ప్లాన్ చేయాలని, తమకు వారసుడిని ఇవ్వాలని కోరుకుంటున్నారు.
