Balineni Srinivasa Reddy: వైసీపీని ఇరుకున పెడుతున్న ఆ సీనియర్
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్ల పాటు బాలినేని పొలిటికల్ కెరీర్ సజావుగా సాగిపోయింది. కానీ మంత్రివర్గ విస్తరణలో పదవిపోవడంతో బాలినేనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు.

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని పార్టీని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారా? హై కమాండ్ కు చికాకు పెడుతున్నారా? పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నమా? వెళ్తూ వెళ్తూ ఇబ్బంది పెట్టి వెళ్లిపోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజా పరిస్థితులు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలు ఉన్నాయన్న కోణంలో ఆయన చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై పార్టీ హై కమాండ్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్ల పాటు బాలినేని పొలిటికల్ కెరీర్ సజావుగా సాగిపోయింది. కానీ మంత్రివర్గ విస్తరణలో పదవిపోవడంతో బాలినేనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. తనను మంత్రి పదవిని తొలగించడం కంటే.. తన జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కు కొనసాగింపు దక్కడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిస్థితికి వైవి సుబ్బారెడ్డి కారణమని అనుమానిస్తూ పార్టీ హై కమాండ్ ను ఇరుకున పెట్టేలా ప్రవర్తిస్తున్నారు. అటు హై కమాండ్ సైతం బాలినేని వదులుకునేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి.
భూ వివాదాలకు సంబంధించి పోలీసుల వ్యవహార శైలి పై నిరసిస్తూ కొద్దిరోజుల కిందట బాలినేని తన సెక్యూరిటీని సరెండర్ చేశారు. సొంత ప్రభుత్వాన్నిఇరుకును పెట్టేలా ప్రవర్తించారు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సర్దుబాటు చేయడంతో స్పందించి సెక్యూరిటీని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఒంగోలు భూకబ్జాల విషయంలో బాలినేని స్పందించారు. రాష్ట్రంలో మిగతా చోట్ల జరుగుతున్న భూకబ్జాల మాటేమిటి అన్న రీతిలో ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని సమర్థిస్తూనే రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలు పెరిగిపోయాయి అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాలినేని ఒక తుది నిర్ణయానికి వచ్చి ఉంటారని.. అందుకే ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు ఈ వ్యవహారంలో ఎటువంటి సంచలనాలు బయటపడతాయో చూడాలి.
