
Revanth Reddy CM
Revanth Reddy CM: ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ ఇది సినిమాలో డైలేగే అయినా.. ఈ మాటకు రాజకీయాల్లో చాలా విలువ ఉంది. సుదీర్ఘ కాలంగా కష్టపడుతున్న రాజకీయనాయకుడు ఇలా అడిగితే ప్రజలు కరిగిపోతారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అలాగే చాన్స్ ఇచ్చారు. తర్వాత వారేమి చేశారన్న విషయం పక్కన పెడితే.. ప్రజలు మాత్రం ఈ పిలుపునకు ఆకర్షితులవుతున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్ల కేసీఆర్‌కు దీటైన నాయకుడు రేవంత్ రెడ్డేనని ప్రజల్లో మంచి నమ్మకం ఉన్న సమయంలో.. ఆయన కూడా ఇదే అస్త్రాన్ని ఎంచుకుంటున్నారు. బహిరంగ సభల్లో ప్రజలను ‘ఒక్క చాన్స్ ఇవ్వండి’ అని కోరుతున్నారు. పాదయాత్రలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఒక్క అవకాశాన్నే జపిస్తున్నారు. పాదయాత్ర అనంతరం జరుగుతున్న కార్నర్ మీటింగులలోనూ ఒక్కచాన్స్ అని అడుగుతున్నారు. కాంగ్రెస్ నాయకులు సైతం ప్లీస్ వన్ చాన్స్ అంటూ జపిస్తున్నారు.

Revanth Reddy CM
రేవంత్‌కు కలిసొస్తుందా..
ఈ మాట నాడు వైఎస్.రాజశేఖరరెడ్డికి కలిసి వచ్చింది. 2019లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి కూడా కలిసి వచ్చింది. ఇద్దరూ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అదే ఒక్కచాన్స్ జపం చేస్తున్న రేవంత్‌కు మరి ఈ మాట కలిసి వస్తుందా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. కాంగ్రెస్‌కు గతంలోనే కలిసి వచ్చిన ఈ మాట.. రేవంత్‌కు ఏమేరకు మేలు చేస్తుందన్న చర్చ జరుగుతోంది.

Revanth Reddy CM
క్యాడర్‌లో జోష్..
ఒక్క చాన్స్ డైలాగ్ కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ పెంచుతోంది. దీంతో రేవంత్ అదే మాట వళ్లిస్తూ పార్టీ శ్రేణులను మరింత మోటివేట్ చేస్తున్నారు. రేవంత్ యాత్రకు యువత నుంచి కూడా మద్దతు వస్తోంది. మరోవైపు రేవంత్ చేస్తున్న పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేల అవినీతి బాగోతంపై చార్జిషీట్ పేరుతో స్థానిక నాయకులతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఇదిగో అంటూ చార్జిషీట్ పేరుతో ప్రజలకు వివరిస్తున్నారు.
మొత్తంగా స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తూ ఇటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అవినీతిని చార్జిషీట్ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్తూ.. రేవంత్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి రేవంత్‌కు ఈ డైలాగ్‌తో సీఎం యోగం కలుగుతుందో లేదో వేచిచూడాలి.