
Rajamouli- Siva Shakthi Datta
Rajamouli- Siva Shakthi Datta: ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటు పై విమర్శలు చేసి సడన్ గా వార్తల్లో నిలిచారు శివశక్తి దత్త. ఈయన కీరవాణికి స్వయానా తండ్రి. రాజమౌళికి పెదనాన్న. ఆర్ ఆర్ ఆర్ రైటర్ విజయేంద్రప్రసాద్ కి అన్నయ్య అవుతారు. శివశక్తి దత్త లిరిసిస్ట్, స్టోరీ రైటర్. గతంలో శివశక్తి దత్త, విజయేంద్ర ప్రసాద్ కలిసి పని చేశారు. జానకి రాముడుతో పాటు పలు హిట్ చిత్రాలకు కథలు అందించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో కీరవాణి స్వరపరచిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది. అయితే అదో గొప్ప సాంగ్ కాదని ఆయన తన అభిప్రాయం వెల్లడించారు.
కీరవాణి కెరీర్లో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ చేశారు. నాటు నాటు సాంగ్ గొప్ప సాంగ్ కాదు. చెప్పాలంటే అదో పాటనా? అందులో సంగీతం ఎక్కడ ఉంది? ఐదు వేలకు పైగా చంద్రబోస్ సాంగ్స్ రాశారు. నాటు నాటు సాంగ్ లో ఏముంది? అని ఆయన మాట్లాడారు. సొంత కుటుంబ సభ్యుడే నాటు నాటు సాంగ్ ని తక్కువ చేసి మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. విశేషం ఏమిటంటే ఆర్ ఆర్ ఆర్ మూవీలోని ‘రామం రాఘవం’ సాంగ్ ఆయన రాశారు.

Siva Shakthi Datta:
తాజా ఇంటర్వ్యూలో శివశక్తి దత్త తన ఫ్యామిలీ డీటెయిల్స్ వివరించారు. పిల్లలు, వాళ్ళ అలవాట్లు గురించి చెప్పారు. కీరవాణికి మ్యూజిక్ తో పాటు మరికొన్ని వ్యాపకాలు ఉన్నాయి. కానీ రాజమౌళికి సినిమానే ప్రపంచం. అతడు ప్రతి నిమిషం సినిమా గురించే ఆలోచిస్తాడు. మేమందరం ఎప్పుడైనా సరదాగా పేకాట ఆడతాం. అప్పుడు కూడా సినిమాల గురించే చరిస్తాడు. తన సినిమాలో సన్నివేశాలు ఎలా ఉండాలో మనసులో అనుకుంటూ ఉంటాడు.
రాజమౌళికి మందు, సిగరెట్ వంటి చెడు అలవాట్లు కూడా లేవు. ఈ రోజుల్లో మందు అలవాటు లేని మూవీ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రాజమౌళినే అని శివశక్తి దత్త అన్నారు. కీరవాణికి ఆ అలవాటు ఉన్నట్లు పరోక్షంగా చెప్పాడు. కీరవాణికి వేరే వ్యాపకాలు ఉన్నాయని చెప్పడం వెనుక అర్థం అదే అంటున్నారు. శివశక్తి దత్త వయసు 91 ఏళ్ళు. ఆయన దర్శకుడు కావాలనుకున్నారట. ఆ కోరిక ఈ వయసులో నెరవేర్చుకుంటున్నారట. ప్రస్తుతం శివశక్తి దత్త ఒక చిత్రానికి దర్శకుడిగా పని చేస్తున్నట్లు సమాచారం.