Lizard: మానవాళి మనుగడకు జంతువులు కూడా దోహదపడుతుంటాయి. మనకు కీడు చేసే వాటిని అంతం చేసే జంతువులు ఉన్నాయి. మనకు మేలు చేసే జంతువులు ఎన్నో ఉన్నాయి. జీవావరణంలో మనుషులతో పాటు కీటకాలు, జంతువులు కూడా ప్రత్యేకమైనవే. అవి లేకపోతే మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. జంతువుల్లో మన ఇంట్లో ఉండేవి కూడా మనకు రక్షణ కల్పిస్తాయి. ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు, కీటకాలు ఉన్నాయి. మన ఇంట్లో బల్లి గురించి చాలా మంది భయపడుతుంటారు. కొందరు దాన్ని అపశకునంగా భావిస్తారు.

Lizard
పర్యావరణ పరిరక్షణలో బల్లులది కూడా ప్రత్యేక పాత్రే. ఈగలు, దోమలు వంటి వాటిని తింటూ బల్లులు మనకు మేలు చేస్తాయి. అవి ఇంట్లో లేకపోతే మనకు వాటి బెడద ఎక్కువగా ఉంటుంది. ఈనేపథ్యంలో ఇంట్లో బల్లులు ఉంటేనే సురక్షితమనే విషయం చాలా మందికి తెలియదు. మానవుల మనుగడలో బల్లులకు మంచి స్థానమే ఉంది. రాత్రి పూట సంచరించే జంతువులను తినేసి మనకు ఇబ్బందులు లేకుండా చేస్తాయి. అందుకే బల్లులను హౌస్ గార్డెన్, టరీ లిజర్ట్స్ గా చెబుతారు.
బల్లుల గురించి చాలా అపోహలు ఉన్నాయి. బల్లి కనబడితే అపశకునమని అనుకుంటారు. ఆహారంలో బల్లి పడితే విషంగా మారుతుందని అంటుంటారు. కానీ అందులో నిజం లేదు. బల్లి పడినంత మాత్రాన ఆహారం విషపూరితం కాదు. బల్లుల్లో మనుషులను చంపేంత విషం ఉండదు. ఈ విషయాన్ని వైద్యులు కూడా ధ్రువీకరించారు. బల్లి పడిన ఆహారం తింటే వాంతులు, తలనొప్పి లాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇవి కూడా మందులతో తగ్గించుకోవచ్చు. కానీ ప్రాణాలు పోయేంత ప్రమాదం మాత్రం ఉండదు.

Lizard
బల్లులు లేకపోతే క్రిమికీటకాల ప్రభావం పెరుగుతుంది. కొత్త కొత్త ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో మన మనుగడకే ఆపద ఉంటుంది. అందుకే జీవావరణం సురక్షితంగా ఉండాలంటే బల్లులు ప్రధానంగా ఉపయోగపడతాయి. వాతావరణ సమతుల్యత జరగాలంటే బల్లులు కూడా మనకు రక్షణగా నిలుస్తాయి. లేకపోతే మనకు కీటకాల నుంచి కొత్త సమస్యలు వస్తాయి. ఇలా మనుషుల మనుగడలో బల్లులు ఎంతో విశిష్టతను సాధించుకుంటాయి. వాటిని మనం రక్షించాల్సిన అవసరం కూడా ఉంటుంది.