Lemon Water: నిమ్మకాయ నీళ్లు తాగితే అధిక బరువు తగ్గుతారా? అసలు నిజమేంటి?
అధిక బరువు సమస్య ఎదుర్కొనే వారు సులభమైన చిట్కాతో దీన్ని దూరం చేసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి విముక్తి దొరుకుతుంది. చాలా మంది ఈ చిట్కా పాటిస్తున్నారు. కానీ అది సవ్యంగా చేయడం లేదు. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. కానీ ఒకసారి వేడి చేసిన నీటిని మళ్లీ వేడి చేయొద్దు.

Lemon Water: ఈ రోజుల్లో అధిక బరువు ఒక శాపంలా మారుతోంది. మన ఆహారాలే బరువుకు కారణాలుగా నిలుస్తున్నాయి. అయినా మనం లెక్కచేయడం లేదు. దీంతో ఊబకాయ సమస్య ఎదురవుతోంది. అధిక బరువుతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నానా రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అందుకే అధిక బరువును అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధిక బరువుతో ఇతర సమస్యలు కూడా చుట్టుముడతాయి. దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే చక్కని పరిష్కారం ఉంది.
అధిక బరువు సమస్య ఎదుర్కొనే వారు సులభమైన చిట్కాతో దీన్ని దూరం చేసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి విముక్తి దొరుకుతుంది. చాలా మంది ఈ చిట్కా పాటిస్తున్నారు. కానీ అది సవ్యంగా చేయడం లేదు. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. కానీ ఒకసారి వేడి చేసిన నీటిని మళ్లీ వేడి చేయొద్దు.
ఒక గిన్నెలో 200 ఎంఎల్ నీటిని తీసుకోవాలి. అవి వేడి చేశాక ఒక గాజు సీసాలోకి తీసుకుని అందులో నిమ్మతొక్కను ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. గోరువెచ్చగా అయిన తరువాత అందులో అర చెక్క నిమ్మరసం వేయాలి. అందులో ఒక టీ స్పూన్ తేనె కూడా కలుపుకుని తాగితే లాభం ఉంటుంది. రోజు ఉదయం పరగడుపున తాగితే బరువు తగ్గే అవకాశాలుంటాయి.
బరువు తగ్గాలనుకునే వారు ఈ చిట్కా పాటిస్తే సరిపోతుంది. నిమ్మకాయ నీళ్లతో మనకు ఎన్నో లాభాలున్నాయి. మన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో నిమ్మకాయ నీళ్లు ఉపయోగపడతాయి. అందుకే ఈ సులభమైన చిట్కా ఉపయోగించుకుని అధిక బరువు సమస్య నుంచి విముక్తులు కావాలని అందరు ప్రయత్నిస్తున్నారు.