Guess Who: ఎన్టీఆర్, రాంచరణ్ లతో నటిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ అందం, అభినయంలో అమ్మకు ఏ మాత్రం తక్కువ కాదు. శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ పై చరిత్ర లిఖించింది. తల్లి అడుగుజాడల్లో నడుస్తున్న జాన్వీ స్టార్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నాలో ఉంది.

Guess Who: ఈ చిన్నారి ఓ స్టార్ కిడ్. ఆమె తల్లి ఇండియాను షేక్ చేసిన హీరోయిన్. సౌత్ కి చెందిన సదరు హీరోయిన్ నార్త్ లో కూడా జెండా పాతింది. ఆమె వారసురాలిగా ఈ చిన్నారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో నటిస్తున్న ఈ అమ్మడు, త్వరలో రామ్ చరణ్ తో సయ్యాటలాడనుంది. ఇప్పటికే ఎవరో మీరు పసిగట్టే ఉంటారు. అప్పటి ఈ క్యూట్ చిన్నారి ఎవరో కాదు ఇప్పటి హాట్ బ్యూటీ జాన్వీ కపూర్.
అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ అందం, అభినయంలో అమ్మకు ఏ మాత్రం తక్కువ కాదు. శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ పై చరిత్ర లిఖించింది. తల్లి అడుగుజాడల్లో నడుస్తున్న జాన్వీ స్టార్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నాలో ఉంది. పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ పక్కన అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. వీరి కాంబోలో దేవర తెరకెక్కుతుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర చిత్రంలో జాన్వీ పాత్ర కథలో ప్రధానంగా సాగుతుందట.
సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తుండగా దేవర చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దేవర 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. అలాగే రామ్ చరణ్ పక్కన ఆర్సీ 16కి జాన్వీ సైన్ చేశారనే మాట వినిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు-చరణ్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ అంటున్నారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. టాప్ స్టార్స్ పక్కన అవకాశాలు దక్కించుకుంటున్న జాన్వీ కపూర్ సౌత్ లో పాగా వేసే సూచనలు కనిపిస్తున్నాయి.
నార్త్ కి ధీటుగా తెలుగు, తమిళ పరిశ్రమలు ఎదిగిన నేపథ్యంలో బాలీవుడ్ భామలు ఆసక్తి చూపుతున్నారు. జాన్వీ పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు అవుతుంది. ఆమె డెబ్యూ మూవీ దఢక్. ఈ చిత్రం 2018లో విడుదలైంది. తన కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలన్న కల నెరవేరకుండానే శ్రీదేవి కన్నుమూశారు. దుబాయ్ హోటల్ లో జరిగిన ప్రమాదంలో శ్రీదేవి మరణించారు. శ్రీదేవి చనిపోయే నాటికి దఢక్ చిత్రీకరణ దశలో ఉంది.
దేవరతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలాజ్ అనే చిత్రాల్లో జాన్వీ నటిస్తుంది. అటు మోడలింగ్ లో కూడా రాణిస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా జాన్వీ బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తారు. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా విపరీతమైన ఫ్యాన్ బేస్ రాబట్టింది. తరచుగా జాన్వీ కపూర్ పై ఎఫైర్ రూమర్స్ వినిపిస్తుంటాయి.
