Uday Kiran- Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషి తో ఎలా ఎదిగాడో మన అందరికి తెలిసిందే..కెరీర్ ప్రారంభం లో ఎన్నో ఒడిదుడుగులు ఎదురుకున్నాడు కాబట్టే ఆ కష్టం విలువ తెలుసు కాబట్టే ఇండస్ట్రీ లో టాలెంట్ ఉన్న కొత్త నటీనటులను ప్రోత్సహించడం లో ముందు ఉంటాడు మన మెగాస్టార్ చిరంజీవి..అప్పట్లో యూత్ లో సెన్సషనల్ గా మారిన ఉదయకిరణ్ ని కూడా ఇలాగే ఎంతో ప్రోత్సహించాడు..ఆయనకీ ఒక్క గాడ్ ఫాదర్ లాగ చిరంజీవి ఎంతో సపోర్టు ని ఇచ్చాడనే చెప్పాలి..అప్పట్లో ఉదయ్ కిరణ్ ఒక్క అమ్మాయిని ప్రేమించి చివరికి పెళ్లి చేసుకోలేకపోయినందుకు ఎంతో కుమిలిపోయాడు..ఆ సమయం లో ఉదయ్ కిరణ్ మానసికంగా ఎంతో కృంగిపోయాడు కూడా..ఆ సమయం లో చిరంజీవి గారే ఉదయ్ కిరణ్ లో ఎంతో ఆత్మవిశ్వాసం ని నింపాడని..ఉదయకిరణ్ ని మాములు మనిషిని చేసి పని మీద దృష్టిపెట్టేలా చేసాడని ఉదయకిరణ్ అక్కగారే స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది..ఉదయ్ కిరణ్ నడవడిక మరియు స్వభావం ఎంతో నచ్చి చిరంజీవి గారు తన కూతురు సుస్మిత ని ఇచ్చి పెళ్లి చేయబోయిన సంగతి మన అందరికి తెలిసిందే.

Chiranjeevi, Uday Kiran
Also Read: Virata Parvam Closing Collections: ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ ప్లాప్ మరొకటి లేదు !
అప్పట్లో చిరంజీవి కూతురు సుస్మిత తో ఉదయ్ కిరణ్ కి ఘనంగా నిశ్చితార్థం కూడా చేసారు..అంత సజావుగా సాగుతున్న సమయం లో ఉదయ్ కిరణ్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి..ఆ అమ్మాయికి నాకు సెట్ అవ్వదు అంటూ ట్విస్ట్ ఇవ్వడం తో ఈ పెళ్లి పీటలు వరుకు వెళ్లి ఆగిపోయింది..అప్పట్లో ఈ సంఘటన పెద్ద సెన్సషనల్ గా మారింది..ఇక ఆ తర్వాత ఉదయకిరణ్ కి వరుసగా సినిమా ఆఫర్స్ ఆగిపోవడానికి కూడా చిరంజీవే కారణం అంటూ ఎల్లో మీడియా తెగ ప్రచారం చేసింది..కానీ ఉదయకిరణ్ కి అప్పటికే వరుసగా ఫ్లాప్స్ రావడం ప్రారంభం అయ్యాయి..వరుస ఫ్లాప్స్ వస్తే గొప్ప గోప బ్యాక్ గ్రౌండ్ నుండి వస్తున్నా వారు కూడా స్టార్ ఇమేజి ని కోల్పోతున్న రోజులివి..దీనికి ఉదయ్ కిరణ్ ఏ మాత్రం మినహాయింపు కాదు..సరైన స్క్రిప్ట్ సెలెక్షన్స్ లేకపోవడం వల్లే ఉదయ్ కిరణ్ కెరీర్ పూర్తిగా డౌన్ గా అయ్యింది..అవకాశాలు కూడా తగ్గిపోయాయి..ఆలా తారాజువ్వ లా ఎగసిన ఉదయకిరణ్ కెరీర్ మనం చూస్తూ ఉండగానే కుప్పకూలిపోయింది..దీనికి ఎవరి ప్రమేయం లేదు..కేవలం ఉదయకిరణ్ నిర్ణయాలే ఆయన పతనానికి దారి తీసింది అంటూ ఇటీవలే ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారింది.

Susmitha, Chiranjeevi
Also Read: Chiranjeevi Movies: ‘ఆ’ అక్షరం తో వచ్చిన చిరంజీవి సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయ్యాయో తెలుసా!