Alcohol Glass : గాజు గ్లాసులోనే మద్యం ఎందుకు తాగుతారో తెలుసా?

Alcohol Glass : మద్యం తాగే వారి సంఖ్య పెరుగుతోంది. మద్యానికి అందరు బానిసలవుతున్నారు. చుక్క పడనిదే నిద్ర పోవడం లేదు. ఇది ఓ ఫ్యాషన్ గా మారింది. సాయంత్రం అయితే చాలు మందు తాగడమే అలవాటుగా పెట్టుకుంటున్నారు. దీంతో మద్యం తాగుతూ తూగుతున్నారు. మందు తాగనివాడిని ఏదో నేరం చేసిన వాడిని చూసినట్లు చూస్తారు. మద్యం తాగే వారు స్టీలు గ్లాసులలో కాకుండా గాజు గ్లాసులలో తాగుతుంటారు. ఇందులో మర్మమేమిటో తెలిస్తే మనకు కూడా ఆశ్చర్యం […]

  • Written By: Shankar
  • Published On:
Alcohol Glass : గాజు గ్లాసులోనే మద్యం ఎందుకు తాగుతారో తెలుసా?

Alcohol Glass : మద్యం తాగే వారి సంఖ్య పెరుగుతోంది. మద్యానికి అందరు బానిసలవుతున్నారు. చుక్క పడనిదే నిద్ర పోవడం లేదు. ఇది ఓ ఫ్యాషన్ గా మారింది. సాయంత్రం అయితే చాలు మందు తాగడమే అలవాటుగా పెట్టుకుంటున్నారు. దీంతో మద్యం తాగుతూ తూగుతున్నారు. మందు తాగనివాడిని ఏదో నేరం చేసిన వాడిని చూసినట్లు చూస్తారు. మద్యం తాగే వారు స్టీలు గ్లాసులలో కాకుండా గాజు గ్లాసులలో తాగుతుంటారు. ఇందులో మర్మమేమిటో తెలిస్తే మనకు కూడా ఆశ్చర్యం కలగక మానదు.

ఎందుకు గాజు గ్లాసులో..

మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలలో దాన్ని స్టీల్ పాత్రల్లోనే తయారు చేస్తారు. సుదీర్ఘ ప్రాంతాలకు తరలించే క్రమంలో కూడా స్టీల్ పాత్రల్లోనే చేస్తుంటారు. అందుకే మందు తాగే సమయంలో స్టీల్ గ్లాసులకంటే గాజు గ్లాసుల్లోనో, ప్లాస్టిక్ గ్లాసుల్లోనో తాగడం చూస్తుంటాం. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమే. కానీ మద్యం తాగే వారు స్టీల్ గ్లాసుల్లో కాకుండా గాజు గ్లాసుల్లో తాగుతుంటారు. ఈ విషయంలో గాజు గ్లాసులో తాగితేనే వారికి మద్యం తాగిన అనుభూతి కలుగుతుందని కూడా భావిస్తుంటారు. అందుకే గాజు గ్లాసుల్లో మద్యం తాగుతుంటారు.

స్టీల్ గ్లాసుల్లో ..

స్టీల్ గ్లాసుల్లో మద్యం తాగడం వల్ల అందులో మద్యం ఎంత ఉంది అనే విషయం తెలియదు. గాజు గ్లాసులో తాగుతుంటే మద్యం ఎంత అయిపోతుందనే విషయం మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అదే స్టీల్ గ్లాసులో అయితే మద్యం అయిపోతుందనే ఫీలింగ్ కలగదట. అందుకే గాజు గ్లాసులో పోసుకుని తాగడం అలవాటుగా మారిపోయింది. స్టీల్ గ్లాసులో తాగితే ఆరోగ్యానికి హానికరమా? అంటే అదీ కూడా కాదు. కానీ ఎందుకో స్టీల్ గ్లాసులో మద్యం తాగే అలవాటు ఎవరికి ఉండదనే విషయం తెలిసిందే.

మద్యానికి..

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలుగా మారుతున్నారు. గాజు గ్లాసును స్టేటస్ సింబల్ గా పరిగణిస్తారు. అందుకే గాజు గ్లాసుల్లో మద్యం తాగడానికి ఇష్టపడుతుంటారు. ప్లాస్టిక్ గ్లాసుల్లో కూడా తాగుతుంటారు. కానీ స్టీల్ గ్లాసుల్లో మాత్రం అసలు మద్యం తాగరు. దీంతో గాజు గ్లాసుల ప్రాధాన్యం పెరిగిపోయింది. మద్యం తాగాలంటేనే గాజు గ్లాసులు ఉంచుకోవడమే క్లాస్ గా చూస్తున్నారు. స్టీల్ గ్లాసులను మాత్రం మద్యం తాగేందుకు ఉపయోగించేందుకు ఎవరు కూడా ఇష్టపడరు.

సంబంధిత వార్తలు