Dates : ఖర్జూరంతో ముస్లింలు ఉపవాసం ఎందుకు విరమిస్తారో తెలుసా?
Dates : ముస్లింల పవిత్ర మాసం రంజాన్. మార్చి 24 నుంచి ఈ నెల ప్రారంభం అయింది. నెల రోజులు రోజంతా ఉపవాసం ఉంటారు. దీన్ని రోజా అంటారు. ఈ సమయంలో వారు తీసుకునే ఆహారం వేరుగా ఉంటుంది. ఈ నెలలో ముస్లింలు ఉదయం సెహ్రీ సమయంలో ఆహారం తీసుకున్న తరువాత రోజంతా ఆకలి, దాహం వేసినా ఉపవాసం చేస్తారు. ఉపవాసం ముగించే సమయంలో ఖర్జూరం తినడం ద్వారా ఉపవాసం విరమిస్తారు. ఖర్జూరం తిన్న తరువాతే రోజా […]

Dates : ముస్లింల పవిత్ర మాసం రంజాన్. మార్చి 24 నుంచి ఈ నెల ప్రారంభం అయింది. నెల రోజులు రోజంతా ఉపవాసం ఉంటారు. దీన్ని రోజా అంటారు. ఈ సమయంలో వారు తీసుకునే ఆహారం వేరుగా ఉంటుంది. ఈ నెలలో ముస్లింలు ఉదయం సెహ్రీ సమయంలో ఆహారం తీసుకున్న తరువాత రోజంతా ఆకలి, దాహం వేసినా ఉపవాసం చేస్తారు. ఉపవాసం ముగించే సమయంలో ఖర్జూరం తినడం ద్వారా ఉపవాసం విరమిస్తారు. ఖర్జూరం తిన్న తరువాతే రోజా విరమించడంలో ఏ పద్ధతులు ఉన్నాయో తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.
ఉపవాస సమయంలో ఏదైనా తినడం, తాగడం నిషేధం. సాయంత్రం ఉపవాసం విరమించేటప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఉపవాసం విరమించేటప్పుడు ఖర్జూరాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఖర్జూరం శరీరంలో ఉండే పోషకాల లోపాన్ని తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఖర్జూరం శరీరానికి ఎక్కు వ శక్తినిస్తుంది. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో పోగొట్టుకున్న శక్తులను కూడగట్టుకోవడంలో ఖర్జూరాలు సాయపడతాయి.
ఉపవాసం చేయడం వల్ల ఒంట్లోని శక్తి తగ్గుతుంది. దీంతో ఉపవాసం ముగించే సమయంలో ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా పోయిన శక్తి తిరిగొస్తుంది. ఖర్జూరం తినడం ద్వారా తక్షణం శక్తి లభిస్తుంది. ఇఫ్తార్ సమయంలో తిన్న ఇతర పదార్థాలు జీర్ణం చేయడంలో సాయపడుతుంది. ఖర్జూరం తినడం వల్ల ఒక రోజుకు అవసరమైన పీచులు అందుతాయి. ఫైబర్ కూడా లభిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఎన్నో లాభాలు కలిగిస్తాయి. ఖర్జూరం తినడం ద్వారా ఉపవాసం విరమిస్తారు.
రంజాన్ మాసంలో ముస్లింల భోజనం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. రోజంతా ఉపవాసం చేయడం వల్ల వారికి పోయిన శక్తిని తిరిగి కూడగట్టుకునే క్రమంలో వారి ఆహార అలవాట్లు మంచి ప్రొటీన్లు ఉండేలా చూసుకుంటారు. దీంతో ఖర్జూరాలు తినడం వల్ల వారికి కలిగే శక్తి అపారంగా ఉంటుంది. రోజంతా వారు కోల్పోయిన శక్తి తిరిగి కూడగట్టుకునేందుకు దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో ఖర్జూరాల పాత్ర ఎంతో ఉండటం సహజమే. ఖర్జూరాల వినియోగంతో వారికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని తెలుస్తోంది.