Alcohol : మద్యం తాగిన వారి కళ్లు ఎందుకు ఎర్రగా ఉంటాయో తెలుసా?

అల్కహాల్ తీసుకున్న వ్యక్తి రక్తనాళాలు వ్యాకోచిస్తాయి శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో కంటి ఉపరితలంపై ఉన్న చిన్న రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. కంటిలోని రక్త నాళాలు ఎర్రగా మారుతాయి. మద్యం తాగే వారిలో కళ్లు ఎర్రబడటం గమనించవచ్చు.

  • Written By: Shankar
  • Published On:
Alcohol : మద్యం తాగిన వారి కళ్లు ఎందుకు ఎర్రగా ఉంటాయో తెలుసా?

Alcohol : ఈ రోజుల్లో చాలా మంది మద్యం తాగుతున్నారు. తాగని వారిని అదోలా చూస్తున్నారు. ఏదో ఒక కారణం చూపుతూ రోజు మద్యం తాగేందుకు ఇష్టపడుతున్నారు. మందు తాగడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది. మెదడుకు మద్యం కిక్కు ఎక్కడం వల్ల మనిషి తూలుతూ నడుస్తుంటారు. ఇంకా ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది.

మద్యం తాగేవారిలో కళ్లు ఎర్రబడటాన్ని గమనించుకోవచ్చు. కళ్లు ఎర్రబడటానికి కారణాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యం వేయక మానదు. అల్కహాల్ తీసుకున్న వ్యక్తి రక్తనాళాలు వ్యాకోచిస్తాయి శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో కంటి ఉపరితలంపై ఉన్న చిన్న రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. కంటిలోని రక్త నాళాలు ఎర్రగా మారుతాయి. మద్యం తాగే వారిలో కళ్లు ఎర్రబడటం గమనించవచ్చు.

అల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత రక్తనాళాలు వెడల్పు అవుతాయి. శరీరంలోని అన్ని భాగాలకు అల్కహాల్ వెళ్లడంతో ఇతర పదార్థాల కంటే ఇది వేగంగా వెళ్తుంది. మందు తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. మద్యం సేవించే వారిలో కళ్లు ఎర్రగా మారతాయి. దీంతో సులభంగా తాగిన వారిని గుర్తు పట్టొచ్చు. కానీ ఎవరు కూడా తాగకుండా ఉండలేకపోతున్నారు.

ఇలా మద్యం తాగే వారిలో ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వారి మాట తీరు కూడా మారుతుంది. అల్కహాల్ తో మన అవయవాలు దెబ్బతింటాయి. కాలేయం, గుండె, కిడ్నీలకు ఇబ్బంది కలుగుతుందని తెలిసినా పట్టించుకోకుండా తాగడానికే మొగ్గుచూపుతున్నారు. అందుకే అతిగా తాగొద్దని చెబుతున్నా నిర్లక్ష్యంగానే ఉండటంతో మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు