Allu Arjun First Love Story: స్నేహారెడ్డి కంటే ముందు మరో అమ్మాయితో… అల్లు అర్జున్ ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్-స్నేహారెడ్డి లకు ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు అయాన్ కాగా అమ్మాయి అర్హ. శాకుంతలం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అర్హ కెరీర్ మొదలు పెట్టింది.

Allu Arjun First Love Story: అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. స్నేహారెడ్డిని పట్టుబట్టి దక్కించుకున్నాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెరిగి పెద్దై పెళ్ళికి దారితీసింది. స్నేహారెడ్డి ఫాదర్ మాత్రం మొదట ఒప్పుకోలేదట. స్వయంగా అల్లు అరవింద్ వెళ్లి పిల్లను అడిగినా, నాకు ఇష్టం లేదన్నారట. అల్లు అర్జున్ ని తప్పా వేరొకరిని పెళ్లి చేసుకోనని స్నేహారెడ్డి మొండికేయడంతో ఆయన మనసు కరిగిందట. 2011 మార్చి 6న వీరి వివాహం ఘనంగా జరిగింది.
టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్-స్నేహారెడ్డి లకు ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు అయాన్ కాగా అమ్మాయి అర్హ. శాకుంతలం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అర్హ కెరీర్ మొదలు పెట్టింది. అర్హ బాల భరతుడు పాత్రలో అద్భుతం చేసింది. అర్హ నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ చిత్రానికి అర్హ ప్రత్యేక ఆకర్షణ కావడం విశేషం.
అయితే స్నేహారెడ్డి కంటే ముందు అల్లు అర్జున్ కి మరో గర్ల్ ఫ్రెండ్ ఉందట. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు శృతి అంటూ అల్లు అర్జున్ స్వయంగా వ్యక్తిగత విషయం పంచుకున్నారు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫినాలే జరుగుతుంది. ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చారు. సింగర్ శృతి ‘పిలగా నువ్వు ఇరగ ఇరగ’ సాంగ్ ని అద్భుతం పాడింది. ఆమె పెర్ఫార్మన్స్ ని మెచ్చి అల్లు అర్జున్ తన సంతకం AA బ్యాడ్జ్ ఆమెకు బహూకరించాడు.
అనంతరం శృతి అనే పేరు కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అది నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ అన్నారు. ఈ క్రమంలో అల్లు స్నేహారెడ్డి కంటే ముందు శృతి అనే అమ్మాయిని అల్లు అర్జున్ ప్రేమించాడన్న ప్రచారం మొదలైంది. బహుశా అది స్కూల్ డేస్ లేక కాలేజ్ డేస్ లవ్ కూడా కావచ్చు. ఆయన ఫన్నీగా చెప్పిన విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం చేస్తున్నారు.
