Photo Story : 1957 ‘మాయ బజార్’సినిమాలోని ఈ ముసలాయన ఎవరో తెలుసా? 

ఇందులో కొద్దిసేపే ఉన్నా తన పాత్రకు ఎంతో న్యాయం చేశాడు. తాను ముసలాడిని అయినా తనను పైకి లేపితే నువ్వే గొప్ప అంటూ చమత్కరిస్తాడు. ఎస్వీరంగారావు, కంచి నరసింహారావు కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. ఎస్వీరంగారావు జయంతి సందర్భంగా ఈ పిక్ గురించి చర్చ సాగుతోంది.

  • Written By: SS
  • Published On:
Photo Story : 1957 ‘మాయ బజార్’సినిమాలోని ఈ ముసలాయన ఎవరో తెలుసా? 
Photo Story : ‘మాయ బజార్ (1957)’ సినిమా గురించి ఇప్పటి వారికి తెలియకపోవచ్చు. కానీ ఆ సినిమా చూస్తే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన  ఈ మూవీని ఆ తరువాత మల్టీకలర్లోకి మార్చి రీ రిలీజ్ చేశారు. దీంతో నేటి తరం వారికీ ఈ మూవీ ఎంతో బాగా నచ్చింది. ఇందులో ప్రతీ సీన్ అద్భతంగా తీర్చిదిద్దారు డైరెక్టర్ కెవిరెడ్డి గారు. నాగిరెడ్డి, చక్రపాణిగారు నిర్మించారు. ప్రతీ పాత్రను హైలెట్ చేస్తూ వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమాలో ఓ మాయ కృష్ణుడిగా ఓ వృద్ధుడు కనిపిస్తాడు. ఘటోత్కచుడు రాగానే తనను పైకి లేపితే నీవు గొప్ప అంటాడు. కానీ ఘటోత్కచుడి వల్ల కాదు. చివరికి కృష్ణుడు తన అసలు రూపంలోకి రావడంతో ఘటోత్కచుడు నమస్కరిస్తాడు. అయితే ఈయన  గురించి తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.
‘చిన మాయ పెదమాయ.. పెదమాయ పెనుమాయ.. అటు స్వాహా.. ఇటు స్వాహ.. ఎరుగకుండ వచ్చావు.. ఎరుకలేకపోతావు.. ఇదే వేదం.. ఇదే వేదం.. చిరంజీవ చిరంజీవ.’ అంటూ పద్యం పాటే ఈయన పేరు కంచి నరసింహారావు. 1934 నుంచి ఈయన సినిమాల్లో కొనసాగుతున్నారంటే ఎవరూ నమ్మరు. కానీ ఇది నిజంగా నిజం. 1935లోవచ్చిన ‘హరిశ్చంద్ర’ సినిమాలో ఆయన కాల కౌశికుడిగా నటించారు. ఆ తరువాత ఏవీఎం వారు తీసిన ‘జీవితం’ అనే సినిమాలో నటించారు. 1955లో వచ్చిన దొంగరాముడు చిత్రంలోనూ కనిపిస్తాడు.
1957 మార్చి 27న రిలీజ్ అయిన మాయాబజార్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు, సావిత్రి, రేలంగి నరసింహారావు, ఎస్వీ రంగారావు, గుమ్మడి తదితరులందూ నటించి సినిమాకు ప్రాణం పోశారు. పాండవులు, కౌరవుల మధ్య వచ్చే మనస్పర్థలు ఎలా ఉంటాయి? అనే కథను బేస్ చేసుకొని తీసిన ఈ సినిమాలో సావిత్రి నటనా అత్యంత గొప్పగా కనిపిస్తుంది. ఇక ఇందులో ఓ ఆసక్తికర సన్నివేశం ఉంటుంది. సావిత్రిని తీసుకెళ్లేందుకు వచ్చిన ఘటోత్కచుడికి కృష్ణుడు సాయం చేస్తాడు. అయితే అంతకుముందు అతనికి ఓ పరీక్ష పెడుతాడు. ఆ పరీక్షలో భాగంగా ఓ వృద్ధుడిలా కనిపిస్తాడు. ఆ పాత్రలో నటించారు కంచి నరసింహారావు గారు.

ఆ కాలంలోనే సుప్రసిద్ధ నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయనను సినిమాల్లోకి తీసుకునేందుకు ఆసక్తి చూపేవారట. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే కంచి నరసింహారావు మాయ బజార్ సినిమానే చివరిది కావడం విశేషం. ఇందులో కొద్దిసేపే ఉన్నా తన పాత్రకు ఎంతో న్యాయం చేశాడు. తాను ముసలాడిని అయినా తనను పైకి లేపితే నువ్వే గొప్ప అంటూ చమత్కరిస్తాడు. ఎస్వీరంగారావు, కంచి నరసింహారావు కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. ఎస్వీరంగారావు జయంతి సందర్భంగా ఈ పిక్ గురించి చర్చ సాగుతోంది.

Read Today's Latest Movie old stories News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు