Photo Story: క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ లేడీ సూపర్ స్టార్ ఎవరో తెలుసా?

ఇటు కుర్ర హీరోలు.. అటు సీనియర్ హీరోలు.. ఇలా ఎవరితో నటించినా ఆ సినిమా సక్సెస్ కావాల్సిందే. మరోవైపు హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

  • Written By: SS
  • Published On:
Photo Story: క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ లేడీ సూపర్ స్టార్ ఎవరో తెలుసా?

Photo Story: సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్లు గ్లామర్ తెప్పిస్తారు. వారి అందచందాలతో ఆకట్టుకుంటారు. కానీ కొందరు హీరోయిన్లు ఏ పాత్ర చేయడానికైనా ముందుంటారు. అలాంటివారే ఇండస్ట్రీలో కొనసాగుతారు. నేటి కాలంలో కేవలం అందాన్ని నమ్ముకొని సినిమాల్లో కొనసాగుదామంటే కుదరదు. ఒక్కోసారి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకు రెడీ అయ్యాకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని కొందరు అంటుంటారు. ఇలాంటి విషయాలను బాగా గ్రహించిన ఓ భామ ఎలాంటి అంచనాలు లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ.. హీరోయిన్ గానే కాకుండా ప్రయోగాత్మక పాత్రలు చేసి ఆకట్టుకుంది. ఫలితంగా స్టార్ గుర్తింపు తెచ్చుకొని మిగతా హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. అయితే ఆమెకు సంబంధించిన చిన్న నాటి పిక్ ఒకటి సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది.

ఇటు కుర్ర హీరోలు.. అటు సీనియర్ హీరోలు.. ఇలా ఎవరితో నటించినా ఆ సినిమా సక్సెస్ కావాల్సిందే. మరోవైపు హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. మల్టీఫుల్ వేరియంట్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆ అందాల భామ ఎవరో కాదు అనుష్క శెట్టి. దశాబ్ద కాలంలో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క శెట్టి రీసెంట్ గా ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో అలరించింది. ఈ మూవీలో కాస్త బొద్దుగా కనిపించినా అందంగానే ఉంది అనుష్క. అయితే అనుష్క చిన్నప్పటి నుంచే క్యూట్ గర్ల్ అనిపించుకుంది.

Photo Story

Photo Story

1981 నవంబర్ 7న అనుష్క శెట్టి కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. బెంగుళూరలో కంప్యూటీర్ అప్లికేషన్ లో బ్యాచ్ లర్ చేసిన ఆమె ఆ తరువత యోగా శిక్షకురాలిగా మారారు. తెలుగు డైరెక్టర్ పూరిజగన్నాథ్ ‘సూపర్’ సినిమా కోసం హీరోయిన్ ను వెతుకుతున్న క్రమంలో అనుష్క శెట్టిని చూసి సెలెక్ట్ చేశాడు. అక్కినేని నాగార్జునతో పాటు సోనూసుధ్ నటించిన ఇందులో అనుష్కది ప్లాష్ బ్యాక్ పాత్ర అయినా తన అందం, నటనతో ఆకట్టుకుంది. ఆ తరువాత అనుష్కకు తెలుగులో అవకాశాల వరద మొదలైంది. ఈ మూవీ తరువాత వెంటనే దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి ‘విక్రమార్కుడు’లో ఛాన్స్ కొట్టేసింది.

హీరోయిన్ గానే కాకుండా ‘అరుంధతి’లో హీరోయిన్ ఓరియెంటేడ్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో అనుష్క పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వచ్చింది. మరో వైపు ప్రభాస్ తో కలిసి ‘బాహుబలి’లో నటించి అందరి చేత ప్రశంసలు తెప్పించుకుంది. అయతే ఈ సినిమా తరువాత అనుష్క బిజీగా మారుతుందని అనుకున్నారు. కానీ ఆమెకు తగ్గట్టు సినిమాలు రాలేదు. ప్రస్తుతం అనుష్క చాలా తక్కువ సినిమాల్లో నటిస్తోంది. ఇక తాజాగా ఆమె చిన్ననాటి ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో అనుష్క క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటోంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు