Virupaksha Samyuktha Menon Role: ‘విరూపాక్ష’ లో హీరోయిన్ రోల్ ని మిస్ చేసుకున్న అందాల తార ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఇక ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే థ్రిల్లింగ్ ఫాక్టర్స్ చాలా ఉన్నాయి, వాటితో పాటు హీరోయిన్ సంయుక్త మీనన్ క్లైమాక్స్ యాక్టింగ్ కోసం కూడా ఈ చిత్రాన్ని రిపీట్స్ లో చూడవచ్చు. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ మామూలుది కాదు,

  • Written By: Vicky
  • Published On:
Virupaksha Samyuktha Menon Role:  ‘విరూపాక్ష’ లో హీరోయిన్ రోల్ ని మిస్ చేసుకున్న అందాల తార ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Virupaksha Samyuktha Menon Role: రీసెంట్ గా సమ్మర్ కానుకగా విడుదలైన ‘విరూపాక్ష’ అనే చిత్రం ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. హీరో సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ తర్వాత ఈ చిత్రం కెరీర్ పరంగా పునర్జన్మ ఇచ్చిందనే చెప్పాలి. దాదాపుగా 50 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ చిత్రం రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యి , ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే థ్రిల్లింగ్ ఫాక్టర్స్ చాలా ఉన్నాయి, వాటితో పాటు హీరోయిన్ సంయుక్త మీనన్ క్లైమాక్స్ యాక్టింగ్ కోసం కూడా ఈ చిత్రాన్ని రిపీట్స్ లో చూడవచ్చు. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ మామూలుది కాదు, ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యిపోయింది. సినిమా చివరి వరకు ఆ ట్విస్ట్ ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు అంటే డైరెక్టర్ టేకింగ్ ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే హీరోయిన్ పాత్ర కోసం ముందుగా సంయుక్త మీనన్ కాకుండా, అనుపమ పరమేశ్వరన్ ని అనుకున్నారట. ఇది సాయి ధరమ్ తేజ్ వ్యక్తిగత రిక్వెస్ట్ అని అప్పట్లో టాక్ కూడా నడిచింది. అయితే ఆ సమయం లో అనుపమ పరమేశ్వరన్ మలయాళం మూవీ షూటింగ్ లో బిజీ గా ఉండగా ఆమె బదులుగా సంయుక్త మీనన్ ని తీసుకున్నారు.

అనుపమ పరమేశ్వరన్ కి మొదటి నుండి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చెయ్యడం అంటే చాలా ఇష్టం అని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. ఒక పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో చెయ్యాలి అనేది ఆమె కోరిక అట. పూర్తి స్థాయిలో కాకపోయినా, క్లైమాక్స్ లో నెగటివ్ షేడ్ లో అద్భుతంగా నటించే అవకాశం ఉన్న ‘విరూపాక్ష’ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యిందట అనుపమ పరమేశ్వరన్. మళ్ళీ ఈమెకి కెరీర్ లో అలాంటి పాత్రలు దక్కుతుందో లేదో చూడాలి.
Recommended Video:

సంబంధిత వార్తలు