Panjaa Movie: ‘పంజా’ సినిమాని తప్పించుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అప్పటికే పులి, తీన్ మార్ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఆ సమయం లో ‘పంజా’ చిత్రం ఫలితం వాళ్ళని మరింత కృంగిపోయేలా చేసింది.

Panjaa Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ , బ్లాక్ బస్టర్ హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ తో పాటుగా ఫ్లాప్స్ , డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఫ్యాన్స్ కి వ్యక్తిగతంగా ఇష్టమైన చిత్రాలు కొన్ని ఉన్నాయి, అందులో పంజా సినిమా ఒకటి. తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఆకాశాన్ని అంటే అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.
అప్పటికే పులి, తీన్ మార్ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఆ సమయం లో ‘పంజా’ చిత్రం ఫలితం వాళ్ళని మరింత కృంగిపోయేలా చేసింది. కానీ ఈ చిత్రానికి అప్పట్లో ఓవర్సీస్ లో ఆల్ టైం డే 1 రికార్డు ఉంది, అలాగే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఆల్ టైం టాప్ 2 రికార్డు కూడా వచ్చింది.
ఫుల్ రన్ లో ఈ చిత్రానికి దాదాపుగా 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమాని తొలుత డైరెక్టర్ విష్ణు వర్ధన్ తమిళ స్టార్ హీరో తల అజిత్ తో చేద్దాం అనుకున్నాడు, ఆ సమయం లో ఆయన వేరే సినిమాకి డేట్స్ మొత్తం కమిట్ అయిపోవడం తో ఈ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
ఈ సినిమాని అజిత్ కాకుండా సౌత్ లో మ్యాచ్ చేసే హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అని బలంగా నమ్మి, ఆయనతో ఈ సినిమా తీసాడు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే నచ్చింది కానీ, సెకండ్ హాఫ్ బాగా స్లో అవ్వడం, పవన్ కళ్యాణ్ గత చిత్రం బాలు కి ఈ సినిమాకి దగ్గర పోలికలు ఉండడం తో ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. కానీ ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలు మరియు పవన్ కళ్యాణ్ లుక్స్ అంటే ఫ్యాన్స్ కి ఎంతో ఇష్టం.
