Bigg Boss Gangava: తెలంగాణ ఆత్మ గౌరవ పతాకగా పేరు గాంచిన గంగవ్వకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. ఆ క్రేజ్‌తోనే ఆమె తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లోనూ కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసింది. ఇకపోతే గంగవ్వ ప్రజెంట్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో కీ రోల్ ప్లే చేస్తోంది. తనదైన శైలి యాక్టింగ్‌తో యాస, భాషలతో గంగవ్వ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గంగవ్వ ‘మై విలేజ్ షో ’ అనే యూట్యూబ్ చానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం అయిన సంగతి అందరికీ విదితమే.

Gangava
గంగవ్వ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా మందికి తెలిసి ఉండదు.జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డ గంగవ్వ.. చివరకు ఎవరూ ఊహించని రీతిలో వెండితెరపై మహారాణిగా కొనసా..గుతోంది. గంగవ్వ తల్లిదండ్రి మరణించగా, ఆమె భర్త తాగుడుకు బానిసయ్యాడు. తన భర్త సహకారం లేకుండానే గంగవ్వ ఇద్దరు కూతుర్లు, కొడుకు పెళ్లి చేసింది.
Also Read: కొత్త పీఆర్సీతో కోతలు తప్పవు.. హెచ్ ఆర్ ఏతో ఉద్యోగులకు తలనొప్పులు..!
గంగవ్వ పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’, ‘మల్లేశం’, ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇకపోతే ప్రస్తుతం గంగవ్వ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నది. గంగవ్వ తనయుడి పేరు రాజారెడ్డి. కాగా, రాజారెడ్డి ‘మై విలేజ్ షో ’ యూట్యూబ్ చానల్ కు డైరెక్టర్ గా పని చేశాడు. రాజారెడ్డి కొద్ది రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ సమయంలో గంగవ్వ తీవ్ర మనోవేదనకు గురి అయింది. గంగవ్వ ప్రజెంట్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇందులో చిరుకు తల్లిగా కనిపించబోతున్నదని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ లోనూ గంగవ్వ కీ రోల్ ప్లే చేసింది.

Gangava
మిల్కురి గంగవ్వ ‘బిగ్ బాస్’ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ‘బిగ్ బాస్’ గంగవ్వగా పేరుగాంచింది. అలా యూట్యూట్ సెలబ్రిటీ కాస్తా బుల్లితెరకు పరిచయం అయి అలా.. వెండితెరపైన కూడా మెరిసింది. తెలుగు భాషలో తెలంగాణ మాండలికంలో అత్యద్భుతంగా మాట్లాడి.. సహజ నటిగా గంగవ్వ గుర్తింపు పొందింది. యూట్యూబ్ సమాచార సృష్టికర్తగా గంగవ్వకు మంచి పేరు వచ్చింది. ప్రతిభ ఉంటే చాలు అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పడానికి గంగవ్వ జీవితం నిదర్శనం అని చెప్పే విధంగా ఆమె తయారయింది.
Also Read: కార్యకర్తలు నమ్మిన నేతగా ఎదిగిన లోకేష్.. మరింత రాటుదేలుతున్నాడుగా..!