Baby Movie: షాకింగ్..’బేబీ’ చిత్రాన్ని వదులుకున్న క్రేజీ హీరో అతనేనా..? ఒప్పుకొని చేసుంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదిగా!
ఓపెనింగ్స్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చేట్టు ఉందని అంటున్నారు.మొదటి రోజే ౫ కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే బయ్యర్స్ కి జాక్పాట్ తగిలినట్టే అని చెప్పుకోవాలి, ఎందుకంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 6 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాము.

Baby Movie: చిన్న సినిమాల్లో రీసెంట్ గా విడుదలకు ముందు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘బేబీ ‘. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది, నేటి యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ అద్భుతమైన నటన ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్ళింది.
ఓపెనింగ్స్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చేట్టు ఉందని అంటున్నారు.మొదటి రోజే ౫ కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే బయ్యర్స్ కి జాక్పాట్ తగిలినట్టే అని చెప్పుకోవాలి, ఎందుకంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 6 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాము.
ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రాన్ని 6 ఏళ్ళ క్రిందటే సాయి రాజేష్ దర్శకత్వం వహించాలని అనుకున్నారు. విజయ్ దేవరకొండ అప్పుడే ఇండస్ట్రీ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రోజులవి. ఆయనకీ ఈ సబ్జెక్టు చాలా బాగా నచ్చింది, అయితే హీరోయిన్ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అనే అయ్యోమయ్యం లో పడ్డారు మేకర్స్. ఎందుకంటే ఆ క్యారక్టర్ చాలా బోల్డ్ మరియు నెగటివ్ టచ్ ఉన్న పాత్ర. పెద్ద హీరోయిన్స్ అలాంటివి చెయ్యడానికి ముందుకు రారు, అందుకే ముందుగా టాక్సీవాలా చిత్రాన్ని చేద్దాం అనుకున్నారు.
ఆ సినిమా విడుదల సమయానికి విజయ్ దేవరకొండ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయి ఉంది. ఈ చిత్రం లో ఎక్కువగా హీరోయిన్ పాత్రకే స్కోప్ ఉండడం తో విజయ్ దేవరకొండ ఈ సినిమా నుండి తప్పుకొని తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కి ఇప్పించాడు. అలా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది, నేడు ఆనంద్ దేవరకొండ కి ఈ సినిమా ద్వారా పెద్ద బ్లాక్ బస్టర్ దక్కినట్టే, ఇక నుండి ఆయన ఎలాంటి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటాడు అనేది చూడాలి.