Billa Movie: ప్రభాస్ ‘బిల్లా’ సినిమాని మిస్ చేసుకున్న టాలీవుడ్ క్రేజీ హీరో అతనేనా..?
హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ప్రభాస్ అద్భుతమైన స్టైలిష్ లుక్స్ మరియు నటన ఈ చిత్రాన్ని ఇప్పటికీ మనం రిపీట్స్ లో చూసేలా చేసింది. తమిళం లో అజిత్ హీరో గా నటించిన ‘బిల్లా’ చిత్రానికి ఇది రీమేక్.

Billa Movie: స్టైలిష్ యాక్షన్ ఎంటెర్టైనెర్స్ కి ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉదాహరణకి బాలీవుడ్ షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన రీసెంట్ చిత్రం ‘పఠాన్’ లో పెద్ద స్టోరీ ఏమి లేకపోయినా యాక్షన్ జానర్ అనే కారణం చేత జనాలు ఎగబడి చూసారు, ఫలితంగా 1000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు లో కూడా ఈ జానర్ సినిమాలకు యమక్రేజ్ ఉంది.
కానీ ఒకప్పుడు ఇంత క్రేజ్ ఉండేది కాదు, కేవలం కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు మాత్రమే బాగా ఆడేవి.ఆ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న సమయం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘బిల్లా’ చిత్రం విడుదలైంది. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి అప్పట్లో పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, మన తెలుగు ఆడియన్స్ ఇంకా అలాంటి జానర్ సినిమాలకు అలవాటు పడకపోవడం వల్ల కమర్షియల్ గా యావరేజి గా మాత్రమే మిగిలింది.
హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ప్రభాస్ అద్భుతమైన స్టైలిష్ లుక్స్ మరియు నటన ఈ చిత్రాన్ని ఇప్పటికీ మనం రిపీట్స్ లో చూసేలా చేసింది. తమిళం లో అజిత్ హీరో గా నటించిన ‘బిల్లా’ చిత్రానికి ఇది రీమేక్.ఈ సినిమాలో ప్రభాస్ లో డ్యూయల్ రోల్ చేసాడు.అయితే ఈ చిత్రాన్ని ప్రభాస్ కంటే ముందుగా మెహర్ రమేష్ జూనియర్ ఎన్టీఆర్ కి కథ వినిపించాడట, ఆయనకీ కథ నచ్చింది కానీ, ఈ సినిమా నాకంటే బాగా ప్రభాస్ కి నచ్చుతుంది, అతనితో నువ్వు ఈ ప్రాజెక్ట్ చెయ్యి, మనం మరో సినిమా చేద్దాం అని అన్నాడట.
అలా ఈ క్లాసిక్ చిత్రం ఎన్టీఆర్ చేతి నుండి జారీ ప్రభాస్ చేతికి వెళ్ళింది.అప్పట్లో ఈ సినిమా 14 కోట్ల రూపాయిల రేంజ్ షేర్ వసూళ్లను రాబట్టింది.అప్పటికి ఇది ప్రభాస్ కెరీర్ లో ఆల్ టైం టాప్ 3 గ్రాసర్ గా నిలిచింది. ఆయన నటించిన వర్షం చిత్రం 17 కోట్లు రాబట్టగా,ఛత్రపతి చిత్రం 15 కోట్లు, బిల్లా 14 కోట్లు వసూలు చేసింది.
