Seethamma Vakitlo Sirimalle Chettu: చీరలు కోసం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత పాత్రని వదులుకున్న ఆ క్రేజీ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

హీరోలకు ఎంత మంచి పేరు వచ్చిందో, హీరోయిన్స్ కి కూడా అంత మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా అంజలి కి ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటి వరకు ఆమెకి కేవలం తమిళం లో మాత్రమే మంచి గుర్తింపు ఉండేది.

  • Written By: Vicky
  • Published On:
Seethamma Vakitlo Sirimalle Chettu: చీరలు కోసం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో సీత పాత్రని వదులుకున్న ఆ క్రేజీ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Seethamma Vakitlo Sirimalle Chettu: ప్రస్తుతం మల్టీస్టార్ర్ర్ ట్రెండ్ మన టాలీవుడ్ లో ఈ రేంజ్ లో కొనసాగడానికి ప్రధాన కారణం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రం అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో చిరంజీవి యుగం ప్రారంభమైన తర్వాత మల్టీస్టార్ర్ర్ సినిమాల ట్రెండ్ బాగా తగ్గిపోయింది.ముఖ్యంగా పాపులారిటీ మరియు క్రేజ్ ఉన్న హీరోలు మల్టిస్టార్రర్ సినిమాలు చెయ్యడానికి భయపడేవారు.

అలాంటి సమయం లో విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు ఒక అడుగు ముందుకు వేసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని చేసారు. కమర్షియల్ గా అప్పట్లో ఈ చిత్రం ఒక ప్రభంజనం సృష్టించింది. నిర్మాత దిల్ రాజు కి కాసుల కనకవర్షం కురవగా, అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలబడే అదృష్టం తగిలింది.ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడిగా సమంత నటించగా, వెంకటేష్ కి జోడిగా అంజలి నటించింది.

హీరోలకు ఎంత మంచి పేరు వచ్చిందో, హీరోయిన్స్ కి కూడా అంత మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా అంజలి కి ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటి వరకు ఆమెకి కేవలం తమిళం లో మాత్రమే మంచి గుర్తింపు ఉండేది. ఈ సినిమా ద్వారా తెలుగు లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చింది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా అంజలి కి బదులుగా నయనతార ని అనుకున్నారట. డైరెక్ట్ శ్రీకాంత్ అడ్డాల దిల్ రాజు కి ఈ విషయం చెప్పడం తో, ఈ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతుందని భావించి నయనతార ని సంప్రదించారట.

స్టోరీ ఆమెకి నచ్చింది కానీ, ఆమె పాత్ర ప్రభావం సినిమాలో పెద్దగా లేదని,పాత్రలో డెప్త్ పెంచాలని, అలాగే హీరోయిన్ కి ఆ చీరలు పెట్టడం నాకు ఏమాత్రం నచ్చలేదని, కాస్త ట్రెండీ చీరలు పెట్టాల్సిందిగా కోరిందట, కానీ ఈ రెండు చేస్తే స్క్రిప్ట్ కి చాలా ఇబ్బంది, అందుకే శ్రీకాంత్ అడ్డాల ఒప్పుకోలేదట.దాంతో ఆ పాత్ర నయనతార చేతుల్లో నుండి అంజలి కి చేరింది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు