Sarath Babu Last Rites: పాపం శరత్ బాబు కి తలకొరివి పెట్టడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదా..గుండెల్ని పిండేస్తున్న వీడియో

బ్లడ్ ఇన్ఫెక్షన్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ తో బెంగళూరు హాస్పిటల్ లో అడ్మిట్ అయినా శరత్ బాబు ని, అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని AIG హాస్పిటల్స్ కి తరలించాల్సిందిగా సలహా ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 07:40 AM IST

Sarath Babu Last Rites

Sarath Babu Last Rites: తెలుగు మరియు తమిళ బాషలలో ఎన్నో వందల సినిమాల్లో హీరో గా , క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన శరత్ బాబు, మొన్న మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మరణం అటు తమిళ సినిమా ఇండస్ట్రీ ని, ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని శోకసంద్రం లోకి నెట్టేసింది. స్టార్ హీరోలందరూ శరత్ బాబు తో తమకి ఉన్న అనుబంధం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు.

బ్లడ్ ఇన్ఫెక్షన్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ తో బెంగళూరు హాస్పిటల్ లో అడ్మిట్ అయినా శరత్ బాబు ని, అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని AIG హాస్పిటల్స్ కి తరలించాల్సిందిగా సలహా ఇచ్చారు. దాంతో వెంటనే శరత్ బాబు కుటుంబ సభ్యులు ఆయనని AIG హాస్పిటల్స్ కి తరలించి చికిత్స చేయించారు. గత నెల రోజుల నుండి ఆయన మృత్యువుతో పోరాడి మొన్న తుది శ్వాస ని విడిచారు.

అయితే శరత్ బాబు తన తోటి సహనటి రమాప్రభ ని ప్రేమించి పెళ్ళాడి, ఆమెతో 14 ఏళ్ళు కాపురం చేసి , ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణం గా విడిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత శరత్ బాబు తమిళ సీనియర్ నటుడు నంబియార్ కూతురు స్నేహని పెళ్లాడాడు.ఈమెతో కూడా ఆయన 2011 వ సంవత్సరం లో విడిపోయాడు. అయితే శరత్ బాబు కి రెండు పెళ్లిళ్లు అయ్యినప్పటికీ ఒక్క కొడుకు కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం.దీనితో శరత్ కుమార్ కి ఎవరు తలకొరివి పెట్టాలి అనే విషయం పై సందిగ్ధం నెలకిఒంగి.

శరత్ కుమార్ కి ఏడుగురు అన్నదమ్ములు మరియు ఆరుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వీళ్ళందరికీ కలిపి 25 మంది సంతానం ఉంటుంది.శరత్ బాబు పెద్ద అన్నయ్య కుమారుడు చివరికి తలకొరివి పెట్టినట్టు సమాచారం. ఇంత సుదీర్ఘ సినీ ప్రస్థానం ఉన్న శరత్ బాబు చివైరికి సంతానం లేక, తలకొరివి విషయం ఎవరు ఈ కార్యక్రమం చెయ్యాలా అనే సందిగ్ధం లో పడేసి వెళ్లడం అనేది దురదృష్టకరం అనే చెప్పాలి.

https://www.youtube.com/watch?v=bfvwOFlcNV8