Sri Rama Navami 2023: ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు.. శ్రీరాముడి గెటప్ లో ఎంత మంది హీరోలు నటించారో తెలుసా?
Sri Rama Navami 2023: రామాయణం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. రామాయణం నేపథ్యంలో ఎన్నో కథలు, సినిమాలు వచ్చాయి. రామాయణం విన్నంతసేపు ఎంతో మధురంగా ఉంటుంది. దీని మీద వచ్చే సినిమాలు అద్భుతంగా ఉంటాయి. నాటి నుంచి నేటి వరకు రామాయణం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. రాముడు ఎలా ఉంటాడని లైవ్ లో ఎవరూ చూసి ఉండకపోవచ్చు. కానీ సినిమాల ద్వారా రాముడి గురించి చాలా మంది తెలుసుకున్నారు. రాముడిని వెండితెరపై […]


Sri Rama Navami 2023
Sri Rama Navami 2023: రామాయణం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. రామాయణం నేపథ్యంలో ఎన్నో కథలు, సినిమాలు వచ్చాయి. రామాయణం విన్నంతసేపు ఎంతో మధురంగా ఉంటుంది. దీని మీద వచ్చే సినిమాలు అద్భుతంగా ఉంటాయి. నాటి నుంచి నేటి వరకు రామాయణం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. రాముడు ఎలా ఉంటాడని లైవ్ లో ఎవరూ చూసి ఉండకపోవచ్చు. కానీ సినిమాల ద్వారా రాముడి గురించి చాలా మంది తెలుసుకున్నారు. రాముడిని వెండితెరపై పరిచయం చేసింది సీనియర్ ఎన్టీఆర్ అని సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ రాముడి పాత్రలో నటించిన తరువాత ఒకప్పుడు రాముడు ఇలా ఉండేవాడని అనుకుంటున్నారు. అయితే రాముడి పాత్ర అందిరికీ షూట్ కాదు. కొందరికి మాత్రమే అబ్బుతుంది. నాటి నుంచి నేటి వరకు రాముడి గెటప్ లు వేసిన హీరోలెవరో చూద్దాం.
శ్రీరామ నవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. రామాలయాల్లో రాముడి కల్యాణంతో పాటు పట్టాభిషేకం నిర్వహిస్తారు. భక్తులు ఈ వేడుకలను హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సీతా రాముల కల్యాణాన్ని చూసి తరించిపోతారు. ఆలయాలకు వెళ్లలేని కొందరు ఇళ్లలోనే శ్రీరామనవమి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ప్రత్యేక వంటకాలు చేసి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఆ తరువాత కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఈసారి శ్రీరామనవమి మార్చి 30న వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాముడి విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో సినిమాల్లో రాముడి గెటప్ ను ఇప్పటి వరకు ఎంత మంది హీరోలు వేశారోనన్న చర్చ సాగుతోంది.
సీనియర్ ఎన్టీఆర్:
శ్రీరాముడి గెటప్ ను ముందుగా సీనియర్ ఎన్టీఆర్ వేశారని చెప్పుకుంటున్నారు. ఆ తరువాత కృష్ణుడి పాత్రలోనూ ఎన్టీఆర్ అలరించారు. ఎన్టీఆర్ శ్రీరాముడిగా సంపూర్ణ రామాయణం, శ్రీరామ పట్టాభిషేకం, రామాంజనేయ యుద్ధం సినిమాల్లో కనిపించారు. శ్రీరాముడిగా ఎన్టీఆర్ ను చూసి ఆప్పట్లో ఆయన అభిమానులు మురిసిపోయేవారు.

ntr
అక్కినేని నాగేశ్వర్ రావు:
రాముడి పాత్రను ఎన్టీఆర్ కంటే ముందే అక్కినేని నాగేశ్వర్ రావు వేశారని అంటున్నారు. ‘సీతారామ జననం’ అనే సినిమాలో అక్కినేని రాముడిగా కనిపించారని చెప్పుకుంటున్నారు. అసలు విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Akkineni Nageswara Rao
శోభన్ బాబు:
సీనియర్ ఎన్టీఆర్ తరువాత శోభన్ బాబు రాముడి పాత్రలో కనిపించారు. సంపూర్ణ రామాయణం సినిమాలో శోభన్ బాబు రాముడిగా అలరించారు. అయితే టవీల్లో వచ్చే సినిమాల్లో శోభన్ బాబు సంపూర్ణ రామాయణమే రిపీట్ అవుతూ ఉంటుంది.

Sobhan Babu
సుమన్:
రెండో తరం హీరోల్లో దేవుళ్ల గెటప్ షూటయింది సుమన్ కే అని అంటుంటారు. అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరుడిగా సుమన్ తప్ప మరెవరూ నటించలేరన్నది ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా తరువాత సుమన్ ‘శ్రీరామదాసు’ సినిమాలో రాముడిగా కనిపిస్తాడు.ఇందులో నాగార్జున హీరోగా నటించిన విషయం తెలిసిందే.

suman
బాలకృష్ణ:
డైలాగ్ కింగ్ బాలకృష్ణ మాస్ హీరోనే కాకుండా సాఫ్ట్ సినిమాలను కూడా మెప్పించాడని చెప్పొచ్చు. సీనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో కనిపించినందుకు బాలకృష్ణ కూడా ఆ పాత్రలో కనిపించాలని చాలా మంది కోరుకున్నారు. దీంతో శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య రాముడి గెటప్ తో అలరించాడు.

Nandamuri Balakrishna
జూనియర్ ఎన్టీఆర్:
చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ‘బాల రామయణం’లో చిన్న రాముడి గెటప్ తో ఆకట్టుకున్నాడు.

jr ntr
ప్రభాస్:
రెబల్ స్టార్ ప్రభాస్ లేటేస్టు మూవీ ఆదిపురుష్. ఈ సినిమా టీజర్ కూడా విడుదలయింది. ఇందులో రాముడి గెటప్ లో ప్రభాస్ కనిపిస్తున్నాడు.

Prabhas
ఇక దేవుళ్లు సినిమాలో శ్రీకాంత్ రాముడిగా కనిపిస్తాడు. ఇందులో కనిపించింది కాసేపు అయినా శ్రీకాంత్ తన నటనతో ఆకట్టుకున్నారు. ఇంకా చాలా మంది రాముడి పాత్రలో అలరించారు.