Vastu Tips: భోజనం ఎటు వైపు కూర్చుని చేయాలో తెలుసా?

భోజనం ఎప్పుడు కూడా తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా కూర్చుని చేస్తే మంచిది. దక్షిణం వైపు అసలు కూర్చోవద్దు. దక్షిణం దిశ యముడి దిశగా చెబుతుంటారు. అందుకే ఎప్పుడు భోజనం చేసినా ఈ రెండు దిక్కులే మంచివిగా భావించాలి. భోజనం వడ్డించాక మొదటి ముద్దను దైవానికి సమర్పించాలి. భోజనం అయిపోయాక ఆ ముద్దను పక్షులకు కానీ చీమలకు కానీ ఆహారంగా వేయాలి.

  • Written By: Srinivas
  • Published On:
Vastu Tips: భోజనం ఎటు వైపు కూర్చుని చేయాలో తెలుసా?

Vastu Tips: ప్రస్తుతం అన్ని వాస్తు ప్రకారమే చూసుకుంటున్నారు. పక్కా వాస్తు ప్రకారమే అన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంట గది ఎటు ఉండాలి. ఏ దిశలో నిర్మించుకోవాలి. ఏ వస్తువులు ఎటు వైపు ఉంచుకోవాలి. వంట ఎక్కడ చేయాలి. భోజనాలు ఎలా చేయాలనే దానిపై అందరు చొరవ చూపుతున్నారు. దీంతో వాస్తు శాస్త్రంను బాగా ఫాలో అవుతున్నారు. మారుతున్న పరిస్థితుల్లో అన్ని పక్కాగా ఉండాలని చూస్తున్నారు. తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా ఆలోచించాల్సి వస్తోంది.

భోజనం ఎలా చేయాలి?

భోజనం ఎప్పుడు కూడా తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా కూర్చుని చేస్తే మంచిది. దక్షిణం వైపు అసలు కూర్చోవద్దు. దక్షిణం దిశ యముడి దిశగా చెబుతుంటారు. అందుకే ఎప్పుడు భోజనం చేసినా ఈ రెండు దిక్కులే మంచివిగా భావించాలి. భోజనం వడ్డించాక మొదటి ముద్దను దైవానికి సమర్పించాలి. భోజనం అయిపోయాక ఆ ముద్దను పక్షులకు కానీ చీమలకు కానీ ఆహారంగా వేయాలి.

పరిశుభ్రతకు..

భోజనం చేసే సమయంలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. మనం తినే పాత్ర శుభ్రంగా ఉండాలి. మనం కూడా శుభ్రమైన ప్రదేశంలోనే కూర్చోవాలి. అంతేకాని అపరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చుని భోజనం చేయడం వల్ల దారిద్ర్యం తాండవిస్తుంది. ఇలా భోజనం విషయంలో అశ్రద్ధ పనికి రాదు. భోజనం చేసే విషయంలో అన్ని కరెక్టుగా ఉండాలి.

పచ్చని ఆకులో

పచ్చని ఆకులో భోజనం చేస్తే ఎంతో మంచిది. అరటి, మోదుగ కానీ ఆకులు వేసుకుని భోజనం చేస్తే దాని ఫలితం బాగుంటుంది. ఆకుల్లో కూడా మనకు కొన్ని రకాల పోషకాలు అందుతాయి. అందుకే వేడి అన్నం ఆకుల్లో పెట్టుకుని తింటే ఆ రుచే వేరు. దేవుడికి ఆకుల్లోనే నైవేద్యం పెడుతుంటాం. ఆకులకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది కావడంతో వాటిని ఉపయోగిస్తే చాలా మంచిది.

వెండి పళ్లెం

ఎవరి తాహత్తును బట్టి వారు తింటుంటారు. బాగా డబ్బున్న వారు బంగారు పళ్లాలు కూడా వాడతారు. ఇంకా కొంచెం డబ్బు ఉన్న వారు వెండి పాత్రలు కూడా వినియోగిస్తారు. వెండి కంచం వాడితే మధ్యలో బంగారంతో చేసిన బొట్టు ఉంటే మంచిదంటారు. అలా లేని వెండి పల్లెం భోజనానికి వాడకూడదు. తిన్న వెంటనే పడుకుంటే కూడా అరిష్టమే.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు