Prabhas Darling Movie: ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఎప్పుడైతే చత్రపతి సినిమా వచ్చిందో అప్పటి నుండి ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది.అలాంటి ప్రభాస్ తో ఒక అవుట్ అండ్ అవుట్ క్లాస్ మూవీ తియ్యడం అంటే సాహసం అనే చెప్పాలి. కానీ ఆ సాహసం చెయ్యడమే కాకుండా, బాక్స్ ఆఫీస్ భారీ హిట్ ని కూడా అందుకున్న దర్శకుడు కరుణాకరణ్.

  • Written By: Vicky
  • Published On:
Prabhas Darling Movie: ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Prabhas Darling Movie: టాలీవుడ్ లో ఊర మాస్ ఇమేజి ఉన్న హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కచ్చితంగా ఉంటాడు. కారీర్ ప్రారంభం నుండి ఆయన లవ్ స్టోరీస్ కంటే ఎక్కువగా మాస్ సినిమాలనే చేసాడు. ఇక రాజమౌళి తో తీసిన ఛత్రపతి సినిమా తో ఆయనకీ ఊహించని మాస్ క్రేజ్ వచ్చింది. అప్పటి వరకు ప్రభాస్ కేవలం నలుగురిలో ఒక హీరో మాత్రమే.

ఎప్పుడైతే చత్రపతి సినిమా వచ్చిందో అప్పటి నుండి ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది.అలాంటి ప్రభాస్ తో ఒక అవుట్ అండ్ అవుట్ క్లాస్ మూవీ తియ్యడం అంటే సాహసం అనే చెప్పాలి. కానీ ఆ సాహసం చెయ్యడమే కాకుండా, బాక్స్ ఆఫీస్ భారీ హిట్ ని కూడా అందుకున్న దర్శకుడు కరుణాకరణ్.ఆ దర్శకత్వం లో వచ్చిన డార్లింగ్ అనే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా, ప్రభాస్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఈ సినిమా ద్వారానే వచ్చింది.

ఆరోజుల్లో ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అప్పటికీ ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చింది.అయితే ఈ సినిమాని తొలుత ప్రభాస్ తో కాకుండా అల్లు అర్జున్ తో చెయ్యాలనుకున్నాడట డైరెక్టర్ కరుణాకరణ్.అల్లు అర్జున్ లవ్ స్టోరీస్ కి పెట్టింది పేరు లాగా ఉంటాడు, ఆయన చేస్తేనే ఈ చిత్రం బాగుంటుందని డైరెక్టర్ నమ్మకం.

అల్లు అర్జున్ కి నటించాలని ఆసక్తిగా ఉన్నా, ఆ టైం లో డేట్స్ ఖాళీ గా లేకపోవడం తో ఈ పట్టాలెక్కపోయింది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని ప్రభాస్ తో తీసాడు. ఇప్పటి వరకు పూర్తి స్థాయి లవ్ స్టోరీ చెయ్యని ప్రభాస్ తో ‘డార్లింగ్’ సబ్జెక్టు చేస్తే ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మి ఆయన ఆ చిత్రాన్ని తీసాడట. చివరికి ఆయన పెట్టిన నమ్మకమే నిజం అయ్యింది.

సంబంధిత వార్తలు