Venkatesh- Rajamouli: రాజమౌళి తో విక్టరీ వెంకటేష్ ఎలాంటి సినిమాని వదులుకున్నాడో తెలుసా..!
రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్ కాదు, ఆయన రేంజ్ ఆస్కార్ ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి చేరుకుంది. ఆ స్థాయికి చేరుకున్న ఒక లెజెండ్ తో సినిమా చెయ్యాలని ఏ స్టార్ హీరో కి ఉండదు చెప్పండి?, అలాగే విక్టరీ వెంకటేష్ కూడా తన డ్రీం ప్రాజెక్ట్ ని రాజమౌళి తో చేయించుకోవాలనుకున్నాడు.

Venkatesh- Rajamouli: కొన్ని కాంబినేషన్స్ మిస్ అయ్యినప్పుడు ‘అరెరే..ఎంత మంచి కాంబినేషన్ మిస్ అయ్యింది..చేసి ఉంటే మా హీరో రేంజ్ వేరే లెవెల్ లో ఉండేదేమో’ అని అనుకోని బాధపడుతుంటాం. ఇది టాలీవుడ్ లో ప్రతీ స్టార్ హీరో విషయం లో జరిగింది. విక్టరీ వెంకటేష్ ఇలాంటి అవకాశాలను గతం లో చాలానే కోల్పోయాడు. అందులో దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక సినిమా కూడా ఇలాగే వదులుకున్నాడు.
రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్ కాదు, ఆయన రేంజ్ ఆస్కార్ ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి చేరుకుంది. ఆ స్థాయికి చేరుకున్న ఒక లెజెండ్ తో సినిమా చెయ్యాలని ఏ స్టార్ హీరో కి ఉండదు చెప్పండి?, అలాగే విక్టరీ వెంకటేష్ కూడా తన డ్రీం ప్రాజెక్ట్ ని రాజమౌళి తో చేయించుకోవాలనుకున్నాడు. గతం లో జరిగిన ఎన్నో ఇంటర్వ్యూస్ లో వెంకటేష్ తన డ్రీం ప్రాజెక్ట్ గా స్వామి వివేకానంద బయోపిక్ చెయ్యాలని ఉంది అంటూ తన మనసులోని కోరికను చెప్పుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ ప్రాజెక్ట్ ని రాజమౌళి ని డైరెక్ట్ చేయాల్సిందిగా విక్టరీ వెంకటేష్ స్వయంగా రాజమౌళిని కలిసి కోరాడు. రాజమౌళి కూడా వెంటనే ఓకే చెప్పాడు కానీ, ప్రస్తుతం కమిట్ అయ్యి ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తం పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ ని చేస్తానని వెంకటేష్ కి మాట ఇచ్చాడు. అయితే రాజమౌళి తన కమిట్మెంట్స్ పూర్తి చేసుకునే లోపే ఏళ్ళు గడిచిపోయాయి.
ఇప్పుడు ఆయన ఏకంగా ఆస్కార్ అవార్డుని గెలుచుకొని పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇప్పుడు రాజమౌళి తన తదుపరి చిత్రం ఏది తియ్యాలన్నా ముందు చిత్రం కంటే అద్భుతంగా ఉండేట్టు తియ్యాలి. స్వామి వివేకానంద బయోపిక్ కి అంత స్కోప్ లేదు. కాబట్టి వెంకటేష్ తో భవిష్యత్తులో కూడా ఈ సినిమా చేసే పరిస్థితి కనిపించడం లేదు. అలా వెంకటేష్ డ్రీం ప్రాజెక్ట్ కాస్త డ్రీం గానే మిగిలిపోయింది.