Indira Devi -Namrata Shirodkar: కోడలు నమ్రతకు ఇందిరా దేవి ఇచ్చిన విలువైన ఆస్తులు ఏమిటో తెలుసా!

Indira Devi -Namrata Shirodkar: కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి అత్యంత లో ప్రొఫైల్ మైంటైన్ చేశారు. ఒక స్టార్ హీరో వైఫ్, మరో స్టార్ హీరో మదర్ అయి కూడా ఆమె ఎలాంటి గుర్తింపు ఆశించలేదు. మంచి తల్లిగా, భార్యగా బాధ్యతలు నెరవేర్చాడు. కృష్ణ మరో మహిళను వివాహం చేసుకున్నారని తెలిసి ఆయన నిర్ణయాన్ని గౌరవించారు. ఇందిరా దేవి లాంటి ఆడవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. పరిశ్రమలో ఉన్నవాళ్లకు కూడా ఇందిరా గురించి తెలిసింది […]

  • Written By: SRK
  • Published On:
Indira Devi -Namrata Shirodkar: కోడలు నమ్రతకు ఇందిరా దేవి ఇచ్చిన విలువైన ఆస్తులు ఏమిటో తెలుసా!

Indira Devi -Namrata Shirodkar: కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి అత్యంత లో ప్రొఫైల్ మైంటైన్ చేశారు. ఒక స్టార్ హీరో వైఫ్, మరో స్టార్ హీరో మదర్ అయి కూడా ఆమె ఎలాంటి గుర్తింపు ఆశించలేదు. మంచి తల్లిగా, భార్యగా బాధ్యతలు నెరవేర్చాడు. కృష్ణ మరో మహిళను వివాహం చేసుకున్నారని తెలిసి ఆయన నిర్ణయాన్ని గౌరవించారు. ఇందిరా దేవి లాంటి ఆడవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. పరిశ్రమలో ఉన్నవాళ్లకు కూడా ఇందిరా గురించి తెలిసింది తక్కువే. ఐదుగురు పిల్లల తల్లైన ఇందిరా దేవి వాళ్ళను పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేశారు. అంత గొప్ప మనసుంది కాబట్టే కోడలిని కూడా కూతురులా చూసుకుంది.

Indira Devi -Namrata Shirodkar

Indira Devi -Namrata Shirodkar

నార్త్ ఇండియా అమ్మాయి అయినప్పటికీ కోడలు నమ్రతతో ఇందిరా దేవికి మంచి రిలేషన్ ఉండేదట. ఇందిరా దేవి కోడలు నమ్రతను కూతురుగా ట్రీట్ చేసేవారట. ఇక మహేష్-నమ్రతల పెళ్ళిలో కోడలికి విలువైన నగలు బహుమతిగా ఇచ్చారట. వారసత్వంగా వస్తున్న నగలను ఇందిరా దేవి పెళ్ళిలో నమ్రతకు బహుమతిగా ఇచ్చారట. ఆ తర్వాత కూడా నమ్రతకు నచ్చిన అనేక వస్తువులను ఇందిరా దేవి ఆమెకు ఇచ్చేశారట. తనపై ఇందిరా దేవి చూపిస్తున్న ప్రేమకు అంతే కృతజ్ఞతగా నమ్రత ఉండేవారట. అత్తయ్యను తల్లి కంటే ఎక్కువగా గౌరవించేవారట. ఇక మహేష్ కి ఇష్టమైన వంటలు, ప్రవర్తన వంటి అనేక విషయాలు ఇందిరా దేవి దగ్గర నమ్రత నేర్చుకున్నారట.

Also Read: Indira Devi: ఇందిరాదేవి మహేష్ బాబు ఇంట్లో ఉండదా? ఎవరింట్లో ఉండేది?

అలాగే కుటుంబ వేడుకల్లో నమ్రతకు ఇందిరా దేవి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారట. ఇక ప్రతి సోమవారం లంచ్ లేదా డిన్నర్ కి కలవాలనే నియమం ఆ కుటుంబానికి ఉందట. ఆ ట్రెడిషన్ క్రమం తప్పకుండా జరిగేలా చూసే బాధ్యత నమ్రతకు ఇందిరా దేవి అప్పగించారట. అత్తయ్య అప్పగించిన బాధ్యత మహేష్ భార్య నమ్రత జాగ్రత్తగా నెరవేర్చేవారట. ఒక ఆదర్శవంతమైన బాండింగ్ ఇందిరా దేవి-నమ్రతల మధ్య ఉండేదని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం.

Indira Devi -Namrata Shirodkar

Indira Devi -Namrata Shirodkar

నేడు ఇందిరా దేవి మరణించగా ఘట్టమనేని కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. కొద్దిరోజులుగా ఇందిరా దేవి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యం కారణంగా ఆమె వైద్యానికి కూడా సహకరించడం లేదు. దీంతో సెప్టెంబర్ 28వ తేదీ తెల్లవారుజామున కన్నుమూశారు. ఇందిరా దేవి మరణానికి చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. నేడు మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు ముగిశాయి.

Also Read: Anushka Shetty Marriage: అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు మనవాడే.. అతనికి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి !

Tags

    follow us