Health Tips: ప్రస్తుత కాలంలో మనుషుల్లో చురుకుదనం కరువవుతోంది. రోజంతా హుషారు కానరావడం లేదు. దీంతో బద్ధకమే వారిని పలకరిస్తోంది. ప్రత రోజు హుషారుగా ఉండాలంటే ఉదయం వేళ నడక తప్పనిసరి. కాదంటే జాగింగ్ చేయాలి. ఉదయం లేవగానే ఫోన్ పట్టుకోకుండా ఇతర పనులు చేసుకుంటే మంచిది. పొద్దున్నే ఫోన్ చూస్తే మనకు బద్ధకం పెరుగుతుంది. మన మేథస్సు పెరగాలంటే మంచి పనులు చేస్తేనే మంచిది. దీంతో మన ఆలోచనలు కూడా కొత్తదనంగా ముందుకు వెళతాయి. జీవితంలో మంచి లక్ష్యం ఎంచుకుని దాని కోసం శ్రమిస్తే ఇంకా ప్రయోజనమే.

Health Tips
ఉదయం పూట ఎండలో కాసేపైనా కూర్చోవాలి. లేకపోతే శరీరంలో ఉత్తేజం రాదు. ఎండలో ఉండటం వల్ల సూర్యరశ్మి మనకు ఉత్తేజం తీసుకురావడంలో దోహదం చేస్తుంది. ఉదయం పూట ఎండలో డి విటమిన్ లభిస్తుంది. మన ఆరోగ్యానికి డి విటమిన్ ఎంతో అవసరం. కొందరు ఎండలో ఉండకపోతే డి విటమిన్ లోపించి అనారోగ్యం దరిచేరుతుంది. అందుకే మనలో ఉత్సాహం పెరిగేందుకు ఎండ అవసరం ఎంతో పెరిగింది. ఇటీవల కాలంలో చాలా మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. వారిలో ఆ బాధలు రాకుండా ఉండాలంటే ఎండలో ఉండాల్సిందే.
ఉదయం సమయంలో మనం తీసుకునే అల్పాహారం తేలిగ్గా జీర్ణం అయ్యేలా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఎక్కువగా నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల మనం తిన్నది జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. దీంతో కాలేయం దెబ్బతింటుంది. అజీర్తి కలుగుతుంది. పూరీ, బజ్జి వంటి వాటిని దూరం చేసుకోవడమే శ్రేయస్కరం. శరీరానికి అవసరమయ్యే వాటిలో పండ్లు తీసుకుంటే ప్రయోజనం. నీళ్లు ఎక్కువగా తాగాలి. నట్స్ తీసుకుంటే కూడా మన ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది.

Health Tips
మధ్యాహ్నం సమయంలో ఓ పది పదిహేను నిమిషాలు నిద్ర పోవడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తరువాత ఫోన్ చూడకుండా కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా ఉంటే ఎంతో బాగుంటుంది. ప్రతి రోజు 6-8 గంటల పాటు హాయిగా నిద్రపోవాలి. సాయంత్రం పూట తినే భోజనం ఆరు గంటల వరకే ముగించాలి. తొందరగా పడుకుంటే త్వరగా మెలకువ వస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీనికి అందరు జాగ్రత్తలు తీసుకుంటే సరి. లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి.