Mental Health: మనలో చాలా మందికి మానసిక ప్రశాంతత కరువవుతోంది. నేటి పరిస్థితులు మానసిక స్థితి దుర్బరంగా మారేందుకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మానసిక పరిస్థితి బాగా లేకుండా పోవడానికి దారి తీసే వాటిని దూరం చేసుకోవడం ఉత్తమం. ప్రకృతి మనసుకు ఉత్సాహం కలిగిస్తుంది. వినోదం పంచుతుంది. మనసు ఉల్లాసంగా మారడానికి దోహదపడుతుంది. ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. తరచూ పార్కుల్లో గడిపితే మనసు కుదుటపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మానసిక స్థితి మంచిగా మారుతుంది.

Mental Health
మానసికంగా అదుపు తప్పేందుకు కోపం కూడా కారణమవుతుంది. భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు ఆలోచనలు పక్కదారి పడతాయి. దీంతో బాధలు మనల్ని బాధించడం మామూలే. కోపాన్ని వెనక్కి తీసుకుంటే ఉత్తమం. ఉద్వేగాల్ని నియంత్రించుకోకపోతే మానసిక పరిస్థితి దెబ్బతింటుంది. ఎదుటి వారికి సహాయం చేయడం, చిన్న పిల్లలతో సరదాగా గడపడం వల్ల కూడా మానసిక ప్రశాంతతకు దారి తీస్తుంది. మనకు బాధ కలిగినప్పుడు దగ్గరి వారికి చెప్పుకుని ఉపశమనం పొందితే కూడా ఫలితం ఉంటుంది.
ఆర్థిక సమస్యలు కూడా ఇబ్బంది పెట్టినప్పుడు మానసిక ఆరోగ్యం దెబ్బతీస్తుంది. దీని నుంచి కాపాడుకోవడానికి సకాలంలో రుణాలు చెల్లించడమే పరిష్కారం. పొదుపు చేస్తూ సమస్యలు రాకుండా చూసుకోవాలి. రోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. లేకపోతే మానసిక స్థితిలో తేడా వస్తుంది. నిద్రలేమితో అనేక రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. దీంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా ప్రధానమే. మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉండాలంటే రోజు వ్యాయామం చేయాలి.

Mental Health
ధ్యానం చేయడం వల్ల కూడా మానసిక స్థితి బాగుంటుంది. ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఉదయం పూట ధ్యానం చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. కొత్త ఆలోచనలతో మనసు ఎంతో హుషారుగా మారుతుంది. దీంతో మానసిక స్థితి బాగుపడి మంచి ఫలితాలు రావాలంటే ధ్యానం చేయడం చక్కనైన పరిష్కార మార్గంగా గుర్తించుకోవాలి.