Astrology: రాహు, కేతువుల దృష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలో తెలుసా?

Astrology: ప్రతి వ్యక్తి జీవితంలో రాహువు, కేతువుల ప్రభావం ఉంటుంది. వీటిని ప్రమాదకరమైన గ్రహాలుగా చెబుతారు. మన జాతకంలో రాహువు, కేతువు ఆధిపత్యం చెలాయిస్తుంటే మనకు ఎదురుదెబ్బలే తగుతుంటాయి. జాతకంలో వీటి ప్రభావం ఎక్కువైతే బతుకు దుర్భరంగా మారుతుంది. రాహువు, కేతువుల ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై వాస్తు శాస్త్రంలో ఎన్నో మార్గాలు సూచించారు. ఇలా చేయడం వల్ల వాటి దృష్టి మనపై ఉండదని తెలుసుకోవాలి. ఉగాది నుంచి మూడు నెలల పాటు […]

  • Written By: Shankar
  • Published On:
Astrology: రాహు, కేతువుల దృష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలో తెలుసా?

Astrology: ప్రతి వ్యక్తి జీవితంలో రాహువు, కేతువుల ప్రభావం ఉంటుంది. వీటిని ప్రమాదకరమైన గ్రహాలుగా చెబుతారు. మన జాతకంలో రాహువు, కేతువు ఆధిపత్యం చెలాయిస్తుంటే మనకు ఎదురుదెబ్బలే తగుతుంటాయి. జాతకంలో వీటి ప్రభావం ఎక్కువైతే బతుకు దుర్భరంగా మారుతుంది. రాహువు, కేతువుల ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై వాస్తు శాస్త్రంలో ఎన్నో మార్గాలు సూచించారు. ఇలా చేయడం వల్ల వాటి దృష్టి మనపై ఉండదని తెలుసుకోవాలి.

ఉగాది నుంచి మూడు నెలల పాటు అమ్మవారిని పూజించడం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. రాహువు, కేతువుల ప్రభావం నుంచి బయట పడటానికి ఎన్నో మార్గాలు అన్వేషించాలి. మార్చి 22న ఉగాది వస్తున్నందున దుర్గాదేవిని పూజించడం వల్ల మంచి జరుగుతుందని చెబుతారు. మన జాతకంలో రాహువు, కేతువు అశుభాలను కలిగిస్తున్నందున వాటిని శాంత పరచడానికి చైత్ర నవరాత్రుల్లో కొన్ని పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతుంటారు.

రాహువు, కేతువు జాతకంలో ఉంటే దుష్ర్పభావాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ప్రతి దానికి గొడవలు వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే రాహువు, కేతువులకు పరిహారాలు చేయాల్సిందే. సమస్యలు తొలగిపోవాలంటే రాహువు దోషం ఉన్న వారు బ్రహ్మచారిని అమ్మవారిని పూజిస్తే ఫలితం కనబడుతుంది. కేతువు ప్రభావం ఉంటే చంద్రఘంట అమ్మవారిని పూజించాలి. చైత్ర నవరాత్రుల నుంచిప్రతి రోజు స్నానం చేసే నీటిలో కొంచెం గంధం పొడి కలుపుకోవాలి.

Astrology

Astrology

రాహువు, కేతువుల చెడు దృష్టి ప్రభావం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దుర్గామాత సమేతంగా హనుమంతుడు, శివుడిని పూజించాలి. ప్రతి రోజు శివుడి సహస్ర నామాన్ని, హనుమాన్ సహస్ర నామాలను పారాయణం చేయడం వల్ల రాహు, కేతువుల ప్రభావం తగ్గించుకోవచ్చు. చైత్ర నవరాత్రుల్లో దుర్గా నవరాత్రోత్సవాల్లో తొమ్మిదో రోజు దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల దుష్ఫలితాలు తగ్గుతాయి. ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల వాటి ప్రభావం మనపై పడకుండా ఉంటుంది.

Tags

    follow us