Singer Sunitha: అమెరికాలో సింగర్ సునీత ఏం చేస్తున్నారో తెలుసా..? లైఫ్ ఎంతగా మారిపోయింది!
ప్రొఫెషన్ లో భాగంగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం చేసేవారట. 2020 లాక్ డౌన్ సమయంలో సునీతకు రామ్ ప్రపోజ్ చేశారట. మీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం అన్నారట.

Singer Sunitha: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు… సింగర్ సునీత తీసుకున్న ఓ నిర్ణయం జీవితాన్ని ఆనందమయం చేసింది. రామ్ వీరపనేనితో వివాహం తర్వాత సునీత హ్యాపీగా కనిపిస్తున్నారు. అది ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. సునీత మొదటి భర్త విషయంలో ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడి ఎదుర్కొన్నట్లు సమాచారం. అందుకే ఆయనకు విడాకులు ఇచ్చారు. కొడుకు, కూతురితో ఒంటరిగా ఉంటున్న సునీత జీవితంలోకి రామ్ ప్రవేశించారు. మ్యాంగో మీడియా అధినేత, బిజినెస్ మాన్ రామ్ తో సునీతకు చాలా కాలంగా పరిచయం ఉంది.
ప్రొఫెషన్ లో భాగంగా కలుసుకోవడం, మాట్లాడుకోవడం చేసేవారట. 2020 లాక్ డౌన్ సమయంలో సునీతకు రామ్ ప్రపోజ్ చేశారట. మీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం అన్నారట. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం చెబుతానని సునీత అన్నారట. అనంతరం నిరాడంబరంగా వీరి నిశ్చితార్థం జరిగింది. 2021 జనవరిలో రామ్-సునీతల వివాహం ఘనంగా జరిగింది. చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు వివాహానికి హాజరయ్యారు.
42 ఏళ్ల వయసులో పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉండగా సునీత వివాహం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇది పిల్లలు, నా భవిష్యత్ కోసం తీసుకున్న నిర్ణయం. గౌరవించి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను… అని సునీత అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. ఆమె ఊహించినట్లే రామ్ తో వివాహం ఆమె భవిష్యత్ కి భరోసా ఇచ్చింది. ప్రస్తుతం సునీతకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. అనూహ్యంగా ఆమె కెరీర్ పుంజుకుంది. కొడుకు ఆకాష్ ని హీరో చేస్తున్నారు. రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.
కాగా సునీత అమెరికన్ ట్రిప్ లో ఉన్నారు. అక్కడ మ్యూజికల్ కాన్సర్ట్స్ లో పాల్గొంటున్నారని సమాచారం. అమెరికా దేశంలో తన విహారాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సునీత అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో సునీత జీవితం పూర్తిగా మారిపోయిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. రామ్ తో వివాహం తర్వాత ఆమె సంతోషంగా ఉన్నారు. అందుకు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ నిదర్శనం అంటున్నారు. సునీత వీడియోలు, ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
