Chanakya Neeti : జీవితంలో గెలవాలంటే ఏ లక్షణాలు ఉండాలో తెలుసా?
Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు మన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి చక్కని పరిష్కారాలు సూచించాడు. తన నీతిశాస్త్రంలో మనిషి ఏ పనులు చేస్తే కష్టాలు పడతాడు. ఏ పనులు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతాడు అనే వాటిని గురించి స్పష్టత ఇచ్చాడు. మనకు కలిగే దుఖాలు, సుఖాలకు మన చర్యలే కారణం. గౌతమ బుద్ధుడు కూడా మన దుఖాలకు మన పనులే అని ఆనాడే చెప్పాడు. ఇలా మనిషి జీవితంలో దుఖం ఎందుకు […]

Chanakya Neeti : ఆచార్య చాణక్యుడు మన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి చక్కని పరిష్కారాలు సూచించాడు. తన నీతిశాస్త్రంలో మనిషి ఏ పనులు చేస్తే కష్టాలు పడతాడు. ఏ పనులు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతాడు అనే వాటిని గురించి స్పష్టత ఇచ్చాడు. మనకు కలిగే దుఖాలు, సుఖాలకు మన చర్యలే కారణం. గౌతమ బుద్ధుడు కూడా మన దుఖాలకు మన పనులే అని ఆనాడే చెప్పాడు. ఇలా మనిషి జీవితంలో దుఖం ఎందుకు కలుగుతుంది? దానికి కారణాలేంటి అనే దానిపై చాణక్యుడు క్లారిటీ ఇచ్చాడు.
కర్మలే ప్రధానం
మనం చేసే కర్మలే మనకు సుఖదుఖాలు తెచ్చిపెడతాయి. అది పూర్వ జన్మ అయినా, ప్రస్తుత జన్మ అయినా సరే మనం చేసే పనుల ఎలా ఉంటే వాటి ఫలితం అలాగే ఉంటుంది. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు మనం చేసే కర్మల ద్వారానే వస్తాయని చాణక్యుడు సూచిస్తున్నాడు. మన అలవాట్లు మన జీవితంపై ప్రభావం చూపుతాయి. మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు దారిలో వెళితే చెడు ఫలితాలు మనకు ఎదురు కావడం సహజమే.
మనసు
ఒక వ్యక్తి తన జీవితంలో మంచివాడు అనిపించుకోవాలంటే తన మనసును అదుపులో ఉంచుకోవాలి. లేదంటే అతడి గురించి చెడుగా చెబుతారు. మనసు అదుపులో లేకుంటే మన మాట తీరు సరిగా ఉండదు. దీంతో శత్రువులను తయారు చేసుకుంటాం. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. మనసు చంచలంగా ఉంటే మాటలు కూడా కంట్రోల్ తప్పడంతో అందరితో గొడవలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మనసును నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తే సరి.
అసూయ
ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడాన్ని అసూయ అంటారు. ఇలాంటి వ్యక్తులు ఇతరులు ఎదిగితే ఓర్వలేరు. తాము ఎదగలేరు. దీంతో వారు ఒంటరితనంగా ఉంటారు. ఎవరితో కలవరు. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉందనే భావన కలుగుతుంది. అసూయను తగ్గించుకోకపోతే జీవితంలో ఎదగడం సాధ్యం కాదు. మనిషి తన జీవితంలో ఎదిగే క్రమంలో ఇతరుల ఉన్నతిని ఓర్వలేకపోతే మనకే ఇబ్బందులు వస్తాయని తెలుసుకోవాలి.
మోసం
ఎక్కువగా మోసాలకు పాల్పడే వ్యక్తి కూడా జీవితంలో ఎదగలేడు. తన మనసుపై వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. దీని వల్ల సాధించే లక్ష్యం కూడా చేరుకోలేం. మోసాలతో పనులు చేస్తే అవే మనల్ని కష్టాల పాలు చేస్తాయి. క్రమశిక్షణ, పట్టుదల ఉండాలి. చేరే గమ్యం గురించి కలలు కనాలి. అంతేకాని మోసాలకు పాల్పడితే మనకు చెడ్డ పేరు రావడం ఖాయం. ఇలా ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో ఎదగాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదు.
