N.T.Rama Rao Eating Habits: అప్పటి ముచ్చట్లు : రోజుకు 24 ఇడ్లీలు.. 40 బజ్జీలు.. ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండేవో తెలుసా?
సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లు, ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా.. ఆహారపు అలవాట్లలో ఏమాత్రం తేడా రాకుండా చూసుకునేవారు. ఆయన ఎక్కడున్న సమయానికి కచ్చితంగా భోజనం చేసేవారు.

N.T.Rama Rao Eating Habits: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ నటుడిగా నిలిచేది సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని కొందరు అంటుంటారు. ఆయన సినిమాల్లో ఉన్నంతకాలం స్వర్గయుగంలా ఉండేదని చెప్పుకుంటారు. ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్న రోజుల్లో మిగతా వారికంటే ప్రత్యేకంగా ఉండేవారు. ప్రతీ పనిని టైం టూ టైం చేసేవారు. ఉదయం నుంచి రాత్రి వరకు పర్సనల్ విషయాలు చూసుకుంటునే షూటింగ్ లతో బిజీగా ఉండేవారు. సినిమాల్లో, రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన వ్యవహారాలు, అలవాట్లను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ముఖ్యంగా ఆయన ఆహారం పద్దతులను చూసి చాలా మంది ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లు, ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా.. ఆహారపు అలవాట్లలో ఏమాత్రం తేడా రాకుండా చూసుకునేవారు. ఆయన ఎక్కడున్న సమయానికి కచ్చితంగా భోజనం చేసేవారు. తిండి కలవాడే కండ కలవాడోయ్.. కండకలవాడే సమర్థుడోయ్.. అన్నట్లుగా ఆయన సరైన భోజనం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని ఎక్కువగా నమ్మేవారట. అందువల్ల ఆయన హైదరాబాద్ లోఉన్నా.. ఇతర ప్రాంతాల్లో ఉన్న భోజనం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఉండేవారట. ఇంతకీ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండేవో చూద్దాం..
సినిమాల్లో ఉన్నవిధంగానే ఎన్టీఆర్ రియల్ లైఫ్ లోనూ నిత్యం యాక్టివ్ గా ఉండేవారు. ప్రతీరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేస్తుండేవారు. ఉదయం 4 గంటలకు నిద్రలేచే ఆయన రెండు గంటల పాటు వ్యాయామం చేసేవారట. ఆ తరువాత సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేసేవారట. ఈ బ్రేక్ ఫాస్ట్ లో ఆయన కచ్చితంగా 24 ఇడ్లిలు తినేవారట. అప్పట్లో ఇడ్లీలు ఇప్పుడున్న వాటికంటే పెద్ద సైజులో ఉండేవారని చెబుతున్నారు.
ఒక్కోసారి బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లిలు తినడం కుదరనప్పుడు భోజనం చేసేవారట. ఈ భోజనంలో కచ్చితంగా మాంసం ఉండేలా చూసుకుంటారట. ఎన్టీఆర్ మాంసకృతులు ఎక్కువగా తీసుకునేవారని ఆయన తోటి నటులు చెబుతూ ఉండేవారు. వీటితో పాటు ప్రతి రోజు 2 లీటర్ల బాదం పాలు తీసుకునేవారు. ఇక ఆయన చెన్నైలో ఉన్న సమయంలో బజ్జీలు తినడానికి బాగా ఇష్టపడేవారు. ఈక్రమంలో ఆయన 30 నుంచి 40 బజ్జీలు తినేవారట. సినిమా అయినా వ్యక్తిగత జీవితం అయినా పక్కగా ఉంటేనే లైప్ హ్యాపీగా ఉంటుందని ఎన్టీఆర్ భావించేవారు. అందుకే ఆయన రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా యాక్టివ్ గా ఉండేవారని చెబుతారు. చాలా మంది ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి ఇప్పటికీ చర్చించుకుంటున్నారు.