Tulasi: మనదేశంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందూ మతంలో తులసి చెట్టును శ్రీమహావిష్ణువుతో సమానంగా భావిస్తారు. తులసిని మహిళలు ఎంతో పవిత్రంగా పూజిస్తారు. రోజు ఉదయం సాయంత్రం తులసి కోటకు పూజలు చేస్తారు. తులసిని లక్ష్మీదేవితో పోలుస్తారు. తులసి మొక్కను అత్యంత పవిత్రంగా చూస్తారు. తులసి ఆకులతో కూడా అనేక లాభాలుంటాయి. మధ్యప్రదేశ్ లో అప్పట్లో లీకైన గ్యాస్ లీకేజీలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా తులసి చెట్టు ఉన్న ఇళ్లు మాత్రం నష్టం కలగలేదు.

Tulasi
దీంతో తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో కూడా తేలింది. దీంతో తులసికి ఆయుర్వేదంలో కూడా మంచి ప్రాధాన్యం ఇస్తారు.
తులసి మొక్కతో పాటు ఇతర మొక్కలను పెంచకూడదు. తులసిని ఒంటరిగానే ఉంచాలి. పొరపాటున కూడా తులసితో ఇతర చెట్లను పెంచకూడదు. తులసి మొక్కతో పాటు ఇతర మొక్కలను పెంచితే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీంతో తులసి పక్కన వేరే మొక్కలను నాటడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
తులసితో పాటు కాక్టస్ మొక్కను ఎప్పుడు నాటొద్దు. దీన్ని రాహువు కేతువులకు సంకేతంగా చెబుతారు. దీని వల్ల ప్రతికూల శక్తులు వచ్చే ప్రమాదం ఉంది. తులసి క్రమంగా క్షీణిస్తుంది. అందుకే ఈ మొక్కను తులసి పక్కన పెట్టకూడదు.
తులసి మొక్కతో పాటు ముళ్ల చెట్లు ఉండకూడదు. తులసి మొక్కను ఈశాన్య దిశలో నాటుతాం. రెండు మొక్కలను పక్కపక్కన నాటితే నష్టాలు వస్తాయి. తులసి మొక్కతో పాటు జిల్లేడు మొక్కను కూడా పెట్టొద్దు.
ఒకే కుండిలో రెండు మొక్కలు నాటితే జిల్లేడు నుంచి వచ్చే పాలు తులసి మొక్కపై పడితే తులసి మొక్క పాడైపోతుంది. దీంతో రెండు మొక్కలను పక్కన ఉంచితే దుష్ఫరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో తులసి మొక్క పక్కన ఎలాంటి మొక్కలు ఉంచడం అంత మంచిది కాదు.

Tulasi
తులసి ఎప్పుడు కూడా ఒంటిగానే ఉంచాలి. దాని పక్కన ఏ మొక్కను ఉంచడం భావ్యం కాదు. తులసిని ప్రత్యక్ష దైవంగా భావించడం మన సంప్రదాయం. ఈ క్రమంలో తులసి మొక్కను అత్యంత సురక్షితంగా కాపాడుకోవాలి. దానికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు పాటించాలి. తులసి మొక్కతో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండటంతో దాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. మన విశ్వాసాల ప్రకారం తులసిని ప్రతి ఇంటిలో పెంచుకుని కొలవడం మన సంప్రదాయం. తులసిని కాపాడుకుని మన ఇంటికి ఎలాంటి ఉపద్రవాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.