Vitamin B: మన శరీరం సరిగా పనిచేయాలంటే విటమిన్ల అవసరం ఎంతో ఉంటుంది. ఇందులో బీ1, బీ2, బీ6, బీ7, బీ12 వంటి వాటిని కలిగి ఉన్నాం. దీంతో విటమిన్ల లోపం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ మందగిస్తుంది. ఫలితంగా మనకు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. పిల్లలు, వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విటమిన్ల లోపం రాకుండా చూసుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి సమృద్ధిగా అందాలంటే కొన్ని ఆహార అలవాట్లు పాటించక తప్పదు.

Vitamin B
మన శరీరంలో విటమిన్ల లోపం వల్ల కాళ్లలో మంటలు వస్తాయి. విటమిన్ బి మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇది కూరగాయల నుంచి మొదలుకుని అన్నం, మాంసారాల్లో లభిస్తుంది. విటమిన్ బి లోపిస్తే ఎన్నో నష్టాలు వస్తాయి. దీంతో మన శరీరం బాగుండాలంటే విటమిన్ బి అవసరం ఎంతో ఉంది. విటమిన్ బి లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విటమిన్ బి మాంసారాల్లో కూడా విరివిగా దొరుకుతుంది. అందుకే మాంసాహారం తీసుకునే వారికి విటమిన్ బి లోపం కనిపించదు.
శాఖాహారులు మాత్రం విటమిన్ బి కోసం పోషకాహారాలను తీసుకోవాల్సిందే. విటమిన్ బి ఎక్కువగా సోయా, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాల్లో లభిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే మనకు ఎలాంటి నష్టం వాటిల్దదు. విటమిన్ బి పుష్కలంగా లభించే వాటిని తీసుకుని మన రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవాలి. విటమిన్ బి లోపిస్తే నాలుక పూత, చర్మం మంట, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు వేధిస్తాయి. విటమిన్ బి కోసం మనం సరైన ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.

Vitamin B
విటమిన్ బి సరిగా అందకపోతే ఒత్తిడి బాధిస్తుంది. ఎక్కువగా నడవలేకపోతుంటారు. విటమిన్ బి లోపంవల్ల మన శారీరక వ్యవస్థ దెబ్బతింటుంది. విటమిన్ బి మైక్రో గ్రామ్స్ రూపంలోనే తీసుకోవచ్చు. విటమిన్ బి5 లోపం వల్ల వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది. మెదడుపై తీవ్ర ప్రభావం చూపించేది విటమిన్ బి7. చేపలు, మాంసంలో ఎక్కువగా బి7 విటమిన్ లభిస్తుండటంతో వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిదే. శాఖాహారులు మంచి పోషకాహార ఆహారాలు తీసుకుంటే మేలు.