Hailstones: వడగళ్లను తింటే ఏమవుతుందో తెలుసా?
వడగళ్లు ఎండాకాలంలోనే పడతాయి. దీంతో వాటిని మనం తినకుండా ఉంటేనే సురక్షితం అని తెలుసుకోవడం మంచిదని మన వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Hailstones: మనదేశంలో వడగళ్ల వాన రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వడగళ్లు రైతులకు మిగిల్చేది కడగళ్లు. రాళ్ల వానతో పంటలు నాశనం అవుతాయి. వడగళ్ల వానతో రాళ్లు పడతాయి. ఇవి పంటలను దెబ్బ తీస్తాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరిగింది అదే. వడగళ్లతో మనకు ఎన్నో సమస్యలు రావడం సహజమే. ఈనేపథ్యంలో వడగళ్ల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
వడగళ్లను తినొచ్చా?
వడగళ్లను కొందరు నోట్లో వేసుకుంటారు. కానీ వాటిని తినడం మంచిది కాదు. కానీ కొందరు వినడం లేదు. వడగళ్లను తినేందుకు చొరవ తీసుకుంటున్నారు. ఇందులో సల్ఫేట్స్, నైట్రేట్స్, అమ్మోనియం అయాన్లు, క్లోరైడ్ అయాన్లు కలిసిన రసాయనాలు ఉండటం వల్ల వీటిని తినడం సురక్షితం కాదు. దుమ్ముతోపాటు కాలుష్య ఉద్గారాలు ఉండటం వల్ల వీటిని తినకుండా ఉండటమే శ్రేయస్కరం.
పంటలకు..
వడగళ్ల వానకు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. వడగళ్ల దెబ్బకు రెండు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం జరిగింది. వీటిని తినడం వల్ల మనకు ఇబ్బందులు రావడం సహజం. ఈ క్రమంలో వడగళ్ల రాళ్లను కడుపులోకి తీసుకుంటే మనకు జరిగేది నష్టమే. దీని వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడటం కామనే. దీన్ని అందరు తెలుసుకుని వడగళ్లను తినకుండా చూసుకోవాలి.
శాస్త్రీయ ఆధారాలు
వడగళ్లు మనకు నష్టం చేస్తాయని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. పంటలతో పాటు మన ఆరోగ్యాన్ని ఇవి దెబ్బ తీయడం ఖాయం. అందుకే వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. వడగళ్లు ఎండాకాలంలోనే పడతాయి. దీంతో వాటిని మనం తినకుండా ఉంటేనే సురక్షితం అని తెలుసుకోవడం మంచిదని మన వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
