Anasuya Bharadwaj: జబర్దస్త్ కి రాకముందు అనసూయ ఏం చేసిందో తెలుసా?
కాలేజ్ స్టూడెంట్స్ గుంపులో ఒకరిగా నటించారు. చదువు పూర్తయ్యాక ఓ కార్పొరేట్ కంపెనీలో హెచ్ ఆర్ జాబ్ చేసింది. అనంతరం సాక్షి టీవీలో న్యూస్ రీడర్ గా కూడా చేసింది. 2013లో ప్రయోగాత్మకంగా తెలుగులో జబర్దస్త్ అనే కామెడీ షో స్టార్ట్ చేశారు.

Anasuya Bharadwaj: స్టార్ యాంకర్ అనసూయ బర్త్ డే నేడు. 1985 మే 15న జన్మించిన అనసూయ 38వ ఏట అడుగుపెట్టారు. అనసూయకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, చిత్ర ప్రముఖులు, సన్నిహితులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అనసూయ బర్త్ డే సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అనసూయ ఎంబీఏ చదివారు. ఆమె గోల్ మాత్రం నటి కావడం. చదువుకునే రోజుల్లోనే నటిగా ప్రయత్నాలు చేశారు. 2003లో ఎన్టీఆర్ హీరోగా నాగ టైటిల్ తో పొలిటికల్ థ్రిల్లర్ విడుదలైంది. ఈ చిత్రంలో అనసూయ జూనియర్ ఆర్టిస్ట్ గా చేశారు.
కాలేజ్ స్టూడెంట్స్ గుంపులో ఒకరిగా నటించారు. చదువు పూర్తయ్యాక ఓ కార్పొరేట్ కంపెనీలో హెచ్ ఆర్ జాబ్ చేసింది. అనంతరం సాక్షి టీవీలో న్యూస్ రీడర్ గా కూడా చేసింది. 2013లో ప్రయోగాత్మకంగా తెలుగులో జబర్దస్త్ అనే కామెడీ షో స్టార్ట్ చేశారు. ఈ షో ఆడిషన్స్ కి హాజరైన అనసూయ ఎంపికయ్యారు. జబర్దస్త్ ఊహించని సక్సెస్ కావడంతో అనసూయకు ఫేమ్ దక్కింది . అనసూయ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో పొట్టిబట్టలు వేసిన మొదటి యాంకర్ గా అనసూయను చెప్పుకోవాలి.
జబర్దస్త్ లో చేస్తూ మధ్యలో తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతో షో నుండి వెళ్లిపోయారు. దాంతో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ కాగా ఎక్స్ట్రా జబర్దస్త్ అనే మరో షో స్టార్ట్ చేశారు. దాంతో అనసూయకు రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కింది. అక్కడి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచలంచెలుగా ఎదిగారు.
ఆ షోతో వచ్చిన పాపులారిటీ ఆమెను నటి, ఆపై హీరోయిన్ చేసింది. అనసూయ ప్రస్తుతం బిజీ యాక్ట్రెస్. తెలుగుతో పాటు పలు భాషల్లో చిత్రాలు చేస్తుంది. లీడ్ హీరోయిన్ గా కూడా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయ్యాక అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశారు. జబర్దస్త్ లోకి వచ్చే నాటికే అనసూయ వివాహం జరిగింది. సుశాంక్ భరద్వాజ్ తో అనసూయది ప్రేమ వివాహం. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. అనసూయ బోల్డ్నెస్, యాటిట్యూడ్ వివాదాస్పదం అవుతున్నాయి. కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండతో ఆమెకు కోల్డ్ వార్ నడుస్తోంది.
