Ruthuraj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్ ను పెళ్లి చేసుకున్న యువతి ఎవరో తెలుసా..?
ఈ జంట వివాహానికి ధోనీ రాలేడని తెలుసుకుని.. చెన్నై జట్టు ట్రోఫీ నెగినప్పుడే ధోని ఆశీర్వాదాన్ని తీసుకుంది. టైటిల్ నెగ్గిన రోజే ధోని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.

Ruthuraj Gaikwad : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 వ ఎడిషన్ లో చెన్నై జట్టు తరఫున ఆడిన రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. చెన్నై జట్టు విజయాల్లో ఈ యువ ఆటగాడి పాత్ర ఎనలేనిదని చెప్పవచ్చు. ఓపెనర్ గా వచ్చి మరో ఓపెనర్ కాన్వేతో అద్భుతమైన భాగస్వామ్యాలను నమోదు చేసి చెన్నై జట్టు ట్రోఫీ ముద్దాడేలా చేశాడు ఈ యువ క్రికెటర్. చెన్నై జట్టుకు ట్రోఫీ అందించిన ఆనందం మరువక ముందే మరో గుడ్ న్యూస్ చెప్పాడు ఈ యంగ్ ప్లేయర్. కొంతకాలంగా ప్రేమలో ఉన్న యువతికి మూడు ముళ్ళు వేసి ఒక ఇంటి వాడు అయినట్టు ప్రకటించాడు.
చెన్నై జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక ఇంటివాడయ్యాడు. కొన్నాళ్లు నుంచి ఒక యువతితో ప్రేమలో ఉన్న గైక్వాడ్.. అదే యువతని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న గైక్వాడ్.. ‘స్టేడియం నుంచి మండపం వరకు మా జర్నీ మొదలైంది’ అని క్యాప్షన్ తగిలించాడు. ఈ ఏడాది మంచి ఫామ్ లో ఉన్న గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ గెలవడంలో నగరంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అద్భుతమైన ఆట తీరుతో జట్టుకు విజయాన్ని అందించి పెట్టి మంచి పేరు సంపాదించుకున్న ఈ యువ క్రికెటర్.. తాజాగా వివాహం చేసుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.
డబ్ల్యూటీసి ఫైనల్ కు ఎంపికైనా.. వెనక్కి తగ్గిన రుతురాజ్..
ఐపీఎల్ లో 16 మ్యాచ్ ల్లో 590 పరుగులతో అదరగొట్టాడు రుతురాజ్ గైక్వాడ్. జట్టుకు అవసరమైనప్పుడల్లా మంచి ఆరంభాలను అందించి పెట్టాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తో జరుగుతున్న డబ్ల్యుటిసి ఫైనల్ లో స్టాండ్ బై ప్లేయర్ గా అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే, పెళ్లి ఉండడంతో అతని స్థానాన్ని యశస్వి జైస్వాల్ తో బిసిసిఐ భర్తీ చేసింది. బీసీసీఐ ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన వెంటనే తన వివాహం విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లి మరో ప్లేయర్ ను ఎంపిక చేసేలా చేశాడు రుతురాజ్ గైక్వాడ్.
పెళ్ళి కూతురు ఉత్కర్ష.. ఆమె కూడా క్రికెటర్..
రుతురాజ్ గైక్వాడ్ వివాహం చేసుకున్న అమ్మాయి పేరు ఉత్కర్ష. ఈమె కూడా దేశవాలీలో మహారాష్ట్ర తరఫున క్రికెట్ ఆడుతుంది. ఈ టీమ్ లో ఉత్కర్ష ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. తన 11వ ఆట నుంచి ఉత్కర్ష క్రికెట్ ఆడుతుందని సమాచారం. ఈ క్రమంలోనే ఆమెకు రుతురాజ్ పరిచయం అయ్యాడు. అంతేకాదు రుతురాజ్ కూడా మహారాష్ట్రకే ప్రాతినిధ్యం వహిస్తాడనే విషయం తెలిసిందే. ఈ కొత్త జంటపై నెట్టింట శుభాకాంక్షలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుకున్నాయి. సడన్ గా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
ధోని ఆశీర్వాదం తీసుకున్న జంట..
చెన్నై జట్టు కెప్టెన్ ధోని ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతను ఈ వివాహానికి హాజరైనట్లు కనిపించలేదు. ధోని శస్త్ర చికిత్స విషయం ముందుగానే తెలుసుకున్న ఈ జంట వివాహానికి ధోనీ రాలేడని తెలుసుకుని.. చెన్నై జట్టు ట్రోఫీ నెగినప్పుడే ధోని ఆశీర్వాదాన్ని తీసుకుంది. టైటిల్ నెగ్గిన రోజే ధోని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
