Senior Actor Naresh Assets: నా ఆస్తి విలువ వెయ్యి కోట్లకు పైనే… నరేష్ కి మహేష్ కంటే ఎక్కువ ఉందా? ఎలా సాధ్యం!

నరేష్ వెయ్యి కోట్ల ఆస్తి ఉందని ఓపెన్ గా చెప్పడం సంచలనంగా మారింది. అసలు ఆయనకు తల్లి నుండి ఎంత ఆస్తి వచ్చింది? ఆయన సంపాదన ఎంత? భూములు విలువ పెరిగితే మాత్రం వెయ్యి కోట్ల ఆస్తా?

  • Written By: SRK
  • Published On:
Senior Actor Naresh Assets: నా ఆస్తి విలువ వెయ్యి కోట్లకు పైనే…  నరేష్ కి మహేష్ కంటే ఎక్కువ ఉందా? ఎలా సాధ్యం!

Senior Actor Naresh Assets: నటుడు నరేష్ తన ఆస్తులపై సంచలన ప్రకటన చేశారు. నా ఆస్తి విలువ వెయ్యి కోట్లకు పైనే ఉంటుందన్నారు. నరేష్-పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్ళీ పెళ్లి చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ జంట వ్యక్తిగత విషయాలపై కీలక కామెంట్స్ చేశారు. నరేష్ మాట్లాడుతూ… నేను వెయ్యి కోట్ల ఆస్తిపరుడిని. నాకు వారసత్వంగా కొంత ఆస్తి సంక్రమించింది. నేను కొంత సంపాదించాను. భూముల విలువ పెరగడం వలన ఆస్తి విలువ వెయ్యి కోట్లకు చేరింది. అంతకు మించి కూడా ఉండొచ్చు. నేనెప్పుడూ లెక్కలు చూడలేదు. నా దగ్గర ఉన్నదంతా వైట్. ఎలాంటి బ్లాక్ మనీ లేదు.

ఒక క్రమబద్ధంగా నా సామ్రాజ్యం నిర్మించాను. నేను ఒకటే సిద్ధాంతం ఫాలో అవుతాను. మనకు ఉన్నదాంట్లో కొంత ఇతరులకు పంచాలి. మన చుట్టూ ఉన్నవాళ్లు ఆనందంగా ఉండాలి… అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ… డబ్బు కోసమే పవిత్ర లోకేష్ నాకు దగ్గరైందని కొందరు అంటున్నారు. అది నిజం కాదు. నా దగ్గర డబ్బులు లేవని వెళ్ళిపోయినవాళ్లు ఉన్నారు. డబ్బులకోసమే దగ్గరైన వాళ్ళు ఉన్నారు. మా ఇద్దరిది పవిత్ర బంధం. డబ్బు కారణంగా ముడిపడినది కాదన్నారు.

నరేష్ వెయ్యి కోట్ల ఆస్తి ఉందని ఓపెన్ గా చెప్పడం సంచలనంగా మారింది. అసలు ఆయనకు తల్లి నుండి ఎంత ఆస్తి వచ్చింది? ఆయన సంపాదన ఎంత? భూములు విలువ పెరిగితే మాత్రం వెయ్యి కోట్ల ఆస్తా? అని ఆశ్చర్యపోతున్నారు. విజయనిర్మల నరేష్ తల్లి. కృష్ణ స్టెప్ ఫాదర్ అవుతారు. కృష్ణ ఆస్తులు మహేష్ కి చెందుతాయి. నరేష్ కి ఆయన ఇచ్చి ఉండకపోవచ్చు. అయితే విజయ నిర్మల పేరున ఉన్న ఆస్తులు మాత్రం నరేష్ కి చెందవచ్చు. ఇక నరేష్ రెమ్యూనరేషన్ చూస్తే రోజుకు రూ. 5 నుండి 7 లక్షలు ఉండవచ్చు.

ఈ సంపాదనతో వెయ్యి కోట్ల ఆస్తి సాధ్యమేనా అనిపిస్తుంది. సినిమాకు రూ. 50 కోట్లకు పైన తీసుకుంటున్న మహేష్ ఆస్తి కూడా వెయ్యి కోట్లు ఉండదు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లకు కూడా ఇంత ఆస్తి లేదు. ఈ లెక్కన పరిశ్రమలో నరేష్ ని ఢీ కొట్టే సత్తా ఒక్క రామ్ చరణ్ కి మాత్రమే ఉంది. ఏది ఏమైనా నరేష్ చర్యలు, మాటలు సంచలనం రేపుతున్నాయి.